టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్ట్ ఆఫీసుల్లో ఉద్యోగాలు..!

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియా పోస్ట్ పలు ఉద్యోగాలని భర్తీ చెయ్యడానికి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. ఢిల్లీ పోస్టల్ సర్కిల్‌లో పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, పోస్ట్‌మ్యాన్ పోస్టుల భర్తీకి ఈ నోటిఫికేషన్ జారీ చేసారు. ఆసక్తి, అర్హత వున్నా వాళ్ళు అప్లై చేసుకోచ్చు.

 

indian post
indian post

ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దీనిలో మొత్తం 221 పోస్టులున్నాయి. నోటిఫికేషన్‌లో వెల్లడించిన క్రీడల్లో రాణించినవారు మాత్రమే దరఖాస్తు చేయాలి గమనించండి. పోస్టులకు ఆఫ్‌లైన్ పద్ధతిలో అంటే పోస్టు ద్వారా దరఖాస్తు చేయాలి. జాబ్ నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

దరఖాస్తుకు చివరి తేదీ 2021 నవంబర్ 12. అభ్యర్థులకు నోటిఫికేషన్‌లో సూచించిన విద్యార్హతలతో పాటు క్రీడార్హతలు కూడా ఉండాలి. ఇక పోస్టుల వివరాల లోకి వెళితే.. పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులు 72 వున్నాయి. వీటికి ఇంటర్మీడియట్ పాస్ కావాలి. అలానే పోస్ట్‌మ్యాన్ ఖాళీలు 90 వున్నాయి. వీటికి కూడా ఇంటర్మీడియట్ పాస్ కావాలి. అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 59 ఖాళీలు వున్నాయి. వీటికి టెన్త్ క్లాస్ పాస్ కావాలి.

ఇక వయస్సు విషయానికి వస్తే.. పోస్ట్‌మ్యాన్, పోస్టల్ అసిస్టెంట్, సార్టింగ్ అసిస్టెంట్ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.100. పూర్తి వివరాలని నోటిఫికేషన్ లో చూసి అప్లై చేసుకోండి. https://www.indiapost.gov.in/VAS/Pages/Recruitment/IP_04102021_DL.pdf