షాకింగ్ : హైదరాబాద్ లో ఇంటి పై పడ్డ పిడుగు..!

హైదరాబాదులో వర్ష బీభత్సం కొనసాగుతుంది. శనివారం రాత్రి ఉరుములు మెరుపులతో నగరంలో భారీ వర్షం కురిసింది. ఆల్విన్ కాలనీ డివిజన్ వెంకటేశ్వర నగర్ కాలనీలోని రోడ్ నెంబర్ -5 లో జ్ఞానేశ్వర్ అనే వ్యక్తి ఇంటి పై పిడుగు పడింది. పిడుగు దాడికి ఇంట్లో ఉన్న ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా దెబ్బతిన్నాయి. అంతే గాకుండా పిడుగు పడిన చోట గోడ పెచ్చులు రాలిపడ్డాయి.

ఇంటి ముందు ఒక కారు ఉండగా దాని పై ప్రభావం ఉండటంతో కాస్త దెబ్బతింది. పిడుగు పడిన సమయంలో ఆ స్థలంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇది ఇలా ఉండగా నగరంలో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. భారీ వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడం తో ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారు.