ఆర్బీఐలో ఉద్యోగాలు…ఇలా ఈజీగా దరఖాస్తు చేసుకోండి..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్ లో పలు పోస్టులు ఖాళీగా వున్నాయి. ఆసక్తి అర్హత వున్నవాళ్లు ఆయా పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

పూర్తి వివరాల లోకి వెళితే.. అసిస్టెంట్ మేనేజర్, డిప్యూటీ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది ఆర్బీఐ. కర్ణాటకలోని మైసూర్, పశ్చిమ బెంగాల్‌లోని సల్బోని, బెంగళూరులో ఉన్న కార్పొరేట్ ఆఫిసుల్లో పని చేయాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలను చూస్తే.. డిప్యూటీ మేనేజర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ బ్యాంక్‌గ్రౌండ్ లో ఒక పోస్ట్, అసిస్టెంట్ మేనేజర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీరింగ్ బ్యాంక్‌గ్రౌండ్ ఒక పోస్ట్,  అసిస్టెంట్ మేనేజర్ సివిల్ ఇంజనీరింగ్ బ్యాక్‌గ్రౌండ్ ఐదు పోస్ట్‌లు, అసిస్టెంట్ మేనేజర్ ఫైనాన్స్ అండ్ అకౌంట్ బ్యాక్‌గ్రౌండ్ ఆరు పోస్ట్‌లు, అసిస్టెంట్ మేనేజర్ (సెక్యూరిటీ) నాలుగు పోస్ట్‌లు వున్నాయి.

అప్లై చేసుకోవడానికి 08 అక్టోబర్ 2022 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకి వేర్వేరు విద్యార్హతలు వున్నాయి. అభ్యర్థులను షార్ట్-లిస్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. అప్లికేషన్స్ ని కింద చిరునామాకు పంపాలి.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్ ముద్రన్ ప్రైవేట్ లిమిటెడ్, నం. 3 & 4, I స్టేజ్, I ఫేజ్, BTM లేఅవుట్, బన్నెరఘట్ట రోడ్ పోస్ట్ బాక్స్ నం. 2924, డా.కళాశాల PO, బెంగళూరు – 560029.

 

Read more RELATED
Recommended to you

Latest news