వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌లో ఉద్యోగాలు.. పూర్తి వివరాలివే..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో వున్న వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌ లో పలు ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. పూరి వివరాలను చూస్తే.. 31 పోస్టులు ఖాళీగా వున్నాయి.

ఈ పోస్టుల కి అప్లై చేసుకోవాలంటే ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి టెన్త్, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమాన కోర్సులో ప్యాస్ అయ్యి ఉండాలి. ఇక పోస్టుల వివరాలను చూస్తే.. మైన్ ఫోర్‌మ్యాన్, ఆపరేటర్-కమ్-మెకానిక్, మైన్ మేట్, బ్లాస్టర్ వంటి పోస్టులు ఖాళీగా వున్నాయి. ఈ పోస్టుకు అప్లై చేసుకునే వాళ్ళకి సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

వయస్సు విషయానికి వస్తే.. అక్టోబర్‌ 1, 2022వ తేదీ నాటికి 35 ఏళ్లకు మించకూడదు. ఈ పోస్టులకి అప్లై చేసుకునేందుకు నవంబర్‌ 16, 2022 ఆఖరి తేదీ. రూ.500లు రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద చెల్లించాల్సి వుంది. ఎస్సీ/ఎస్టీ/వికలాంగ అభ్యర్ధులకు ఫీజు అయితే లేదు. ఇక సెలెక్షన్ ప్రాసెస్ గురించి చూస్తే.. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఖాళీల వివరాలను చూస్తే.. మైన్ ఫోర్‌మ్యాన్ పోస్టులు 2, ఆపరేటర్-కమ్-మెకానిక్ పోస్టులు 19, మైన్ మేట్ పోస్టులు 4, బ్లాస్టర్ పోస్టులు 2, డ్రిల్ టెక్నీషియన్ పోస్టులు 4 వున్నాయి. పూర్తి వివరాలను https://www.vizagsteel.com/ లో చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news