నిరుద్యోగులకు శుభవార్త… MES లో భారీగా ఉద్యోగ పోస్టులు…!

Join Our Community
follow manalokam on social media

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. డ్రాఫ్ట్‌మ్యాన్, సూపర్‌ వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఆసక్తి, అర్హత ఉంటే అప్లై చెయ్యచ్చు.

 

CRPF Recruitment 2020

ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే.. దీనిలో మొత్తం 502 ఖాళీలు వున్నాయి. అప్లై చేయడానికి 2021 ఏప్రిల్ 12 చివరి తేదీ. మే 16న రాతపరీక్ష ఉంటుంది. దరఖాస్తు ఫీజు రూ.100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు లేదు.

పూర్తి వివరాలను https://mes.gov.in/ వెబ్‌సైట్‌లో చూడచ్చు. దీనిలో మొత్తం 502 ఖాళీలు ఉండగా అందులో సూపర్‌వైజర్- 450, డ్రాఫ్ట్‌మ్యాన్- 52 పోస్టులున్నాయి. డ్రాఫ్ట్‌మ్యాన్ పోస్టుకు అప్లై చెయ్యాలంటే డిప్లొమా ఇన్ ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్‌షిప్ పాస్ కావాలి. అదే సూపర్‌వైజర్ పోస్టుకు అయితే ఎకనమిక్స్, కామర్స్, స్టాటిస్టిక్స్, బిజినెస్ స్టడీస్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్ డిగ్రీ లేదా డిగ్రీ పాస్ కావాలి.

అలానే డ్రాఫ్ట్స్‌మ్యాన్ పోస్టుకు డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్‌మెంట్, వేర్‌హౌజింగ్ మేనేజ్‌మెంట్, పర్‌చేసింగ్, లాజిస్టిక్స్, పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్‌తో పాటు రెండేళ్ల అనుభవం ఉండాలి. మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్-MES కేంద్ర రక్షణ శాఖ పరిధి లో పని చేసే ప్రముఖ కన్‌స్ట్రక్షన్ ఏజెన్సీ. దీని ద్వారా ఇది ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, డీఆర్‌డీఓకు ఇంజనీరింగ్ సపోర్ట్ ఇస్తుంది. భారత ఆర్మీలో సేవలు అందించాలనుకునే వారికి ఇది మంచి ఛాన్స్ అనే చెప్పాలి.

TOP STORIES

షాకింగ్‌.. ప్ర‌తి 10 ఫోన్ల‌లో 4 ఫోన్లు సైబ‌ర్ దాడుల‌కు అనుకూలం.. నివేదిక‌లో వెల్ల‌డి..!

క‌రోనా కార‌ణంగా గ‌తేడాదిలో చాలా మంది వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేశారు. ఇక ప్ర‌స్తుతం కోవిడ్ కేసులు మ‌ళ్లీ పెరుగుతున్నందున ఉద్యోగులు చాలా మంది ఇళ్ల...