నిట్‌ పుదుచ్చేరిలో ఉద్యోగ అవకాశాలు… వివరాలు ఇవే…!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. నిట్‌ పుదుచ్చేరిలో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. పోస్టులు, అప్లై చేసుకునే విధానం ఇలా అనేక విషయాలు మీకోసం. ఇక వివరాల లోకి వెళితే… నిట్‌ పుదుచ్చేరి లో ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌-01, టెక్నికల్‌ అసిస్టెంట్‌-03, సూపరిం టెండెంట్‌- 02, జూనియర్‌ అసిస్టెంట్‌ లర్థ సీనియర్‌ అసిస్టెంట్‌-04, ఆఫీస్‌ అటెండెంట్‌-01. ఈ పోస్టులని భర్తీ చేయనుంది.

సులువుగా ఆసక్తి, అర్హత ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక అప్లై చేసుకోవాలి అంటే.. ఈమెయిల్‌/ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆఫ్ లైన్ లో అప్లై చెయ్యాలంటే దరఖాస్తును ది రిజిస్ట్రార్‌ (ఐ/సి), నిట్‌ పుదుచ్చేరి, తిరువెట్టకుడి, కరైకల్‌-609609 చిరునామాకు పంపించాలి. ఈమెయిల్ ద్వారా పంపాలంటే ad&[email protected] కి పంపవచ్చు.

మీరు ఈమెయిల్ ద్వారా పంపాలి అంటే మార్చి 10, 2021 ఆఖరి తేదీ. దరఖాస్తు హార్డ్ ‌కాపీలను పంపాలనుకునే వాళ్ళు మార్చి 15, 2021 తేది లోగ పంపాలి. స్కిల్‌/ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ప్రక్రియ ఉంటుంది. పూర్తి సమాచారం కోసం క్లిక్‌ చేయండి: https://www.nitpy.ac.in లో చూడవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news