నెలకు రూ.12,400 స్కాలర్‌షిప్ ని ఇలా పొందండి..!

విద్యార్ధులకి స్కాలర్ షిప్ వస్తే వాళ్ళ యొక్క చదువుకి అది బెనిఫిట్ గా ఉంటుంది. కనుక అవకాశం ఉంటే వీటికి అప్లై చేసుకుంటే మంచిది. సెలెక్ట్ అయితే చక్కగా డబ్బులు వస్తాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ పీజీ విద్యార్థుల కోసం నెల‌వారీ స్కాల‌ర్‌షిప్ ని ఇస్తోంది. దీని కోసం దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తోంది. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే..

 

ఆన్లైన్ ద్వారా ఈ స్కాలర్ షిప్ కోసం అప్లై చెయ్యాలి. ఎంపికైతే 24 నెలల వ్యవధికి, అంటే కోర్సు ప్రారంభమైన తేదీ నుంచి పూర్తయ్యే వరకు నెలవారీ స్కాలర్‌షిప్ రూ .12,400 పొందుతారు.ఒకవేళ దీనిలో ఎంపికైతే ఒక విద్యా సంవత్సరంలో గరిష్టంగా 30 మెడికల్ లీవ్‌ల తో పాటు 15 రోజుల క్యాజువల్ లీవ్ ప్రయోజనాన్ని పొందొచ్చు.

ఇక ఎవరు అప్లై చెయ్యచ్చు అనేది చూస్తే… 2021-22 విద్యా సంవత్సరంలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ, మాస్టర్స్ ఇన్ ఆర్కిటెక్చర్ చదవాలనుకునే వారు అప్లై చెయ్యచ్చు.అలానే గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్-GATE లేదా గ్రాడ్యుయేట్ ఫార్మసీ యాప్టిట్యూడ్ టెస్ట్-GPAT ద్వారా ఏఐసీటీఈ అప్రూవ్డ్ ఇన్‍స్టిట్యూట్స్‌లో చదువుతున్న విద్యార్థులు కూడా అప్లై చెయ్యచ్చు. అదే విధంగా పీజీ స్కాల‌ర్‌షిప్ అద‌నంగా 10శాతం మంది ఈడ‌బ్ల్యూఎస్ వస్తుంది. పూర్తి వివరాలని pgscholarship.aicte-india.org లో చూడచ్చు.