“కింగ్ ఈజ్ బ్యాక్” అంటూ ధోని పై విరాట్ కోహ్లీ ప్రశంసలు

ఐపీఎల్ 2021 క్వాలిఫైయర్ 1 మ్యాచ్ లో భాగంగా నిన్న ఢిల్లీ క్యాపిటల్స్ మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. 172 పరుగుల భారీ లక్ష్యాన్ని చెన్నై ముందు ఉంచింది. అయితే లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్.. మొదట తడబడ్డా… మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్లు రాణించడంతో…. ఢిల్లీ క్యాపిటల్స్ పై విజయం సాధించింది.

అయితే ఈ మ్యాచ్ లో… చెన్నై కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ తిరిగి ఫామ్లోకి వచ్చాడు. కేవలం ఆరు బంతుల్లోనే 3 ఫోర్లు ఒక సిక్సర్ తో 18 పరుగులు సాధించాడు. దీంతో రెండు బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీ పై గెలిచి… ఫైనల్ కు దూసుకెళ్లింది చెన్నై సూపర్ కింగ్స్.

ఇక నిన్నటి మ్యాచ్ లో ధోని చేసిన బ్యాటింగ్ పై.. సీనియర్ లతోపాటు సోషల్ మీడియాలోనూ ప్రశంసల వర్షం కురుస్తోంది. అయితే తాజాగా మహేంద్ర సింగ్ ధోనీ నిన్న చేసిన బ్యాటింగ్ పై విరాట్ కోహ్లీ తనదైన శైలిలో స్పందించారు. ” కింగ్ ఈజ్ బ్యాక్.. క్రికెట్ లో గొప్ప ఫినిషర్. నన్ను సీట్లో నుంచి లేచి ఎగిరి గంతులు వేసేలా చేశాడు ” అంటూ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. ఇంకా విరాట్ కోహ్లీ చేసిన తాజా ట్వీట్ సోషల్ మీడియాలో తెగ ఫ్రెండ్ అవుతోంది.