స్పీకర్ పోచారం కాన్వాయ్ ఢీకొని వ్యక్తి మృతి !

తెలంగాణ శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి ఊహించని షాక్ తగిలింది. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాన్వాయ్లోని వాహనం ఢీకొని… ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. వాహనం అతివేగం నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం అందుతోంది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే.. మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్ళ కల్ గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి అనే వ్యక్తినీ… తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కి చెందిన కాన్వాయ్లోని ఓ వాహనాన్ని ఢీకొట్టింది.

ఈ ప్రమాదం మనోహరాబాద్ మండలం లోని శివారులో చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. హడావిడిగా రోడ్డుపై నడిచిన నర్సింహా రెడ్డి అనే వ్యక్తినీ… స్పీకర్ పోచారం కాన్వాయ్ కి సంబంధించిన ఓ వాహనం ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆ నరసింహారెడ్డి… అక్కడికక్కడే మృతి చెందారు. అతడిని ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన ఉద్యోగి గా గుర్తించారు పోలీసులు. అసలు ఈ ఘటనలో డ్రైవర్ తప్పిదం ఉందా ? లేదా నరసింహారెడ్డి తప్పు ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.