ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు శుభవార్త. ఏకంగా 7500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఈ మేరకు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆసక్తి అర్హత ఉన్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. మే మూడవ తేదీ లోగా ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
కమిషన్ భారత ప్రభుత్వం లోని వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాలు, సంస్థలు మరియు వివిధ రాజ్యాంగ సంస్థలు చట్టబద్ధమైన సంస్థలు ట్రిబ్యునల్ మొదలైన వాటిలో గ్రూపు బి గ్రూప్ సి కంబైండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్ ఎగ్జామినేషన్ 2023 ని నిర్వహిస్తుంది. 7500 తాత్కాలిక పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తుంది.
SSC CGL 2023 అర్హత వివరాలు:
వయస్సు: వేరు వేరు పోస్టులకి వేర్వేరు వయస్సు నిబంధనలు వున్నాయి. పోస్టుని బట్టీ 18-27, 18-30, 18-32 మరియు 20-30 సంవత్సరాల వయస్సు ఉండాలి. నోటిఫైడ్ రిజర్వ్డ్ కేటగిరీలకు గరిష్ట వయోపరిమితి సడలించబడింది.
విద్యార్హతలు: కనీసం బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. పోస్టుల వారీగా విద్యార్హత నోటిఫికేషన్‌లో ఇవ్వబడింది.
SSC CGL 2023 పరీక్ష వివరాలు:
కంప్యూటర్ ఆధారిత పరీక్ష టైర్-I మరియు టైర్-II నిర్వహించబడుతుంది. టైర్-II పరీక్ష ఆధారంగా మాత్రమే మెరిట్ లిస్ట్ ని తీస్తారు.
SSC CGL 2023 దరఖాస్తు రుసుము:
మహిళలు/SC/ST/PwD/ESM మినహా అభ్యర్థులు ఆన్‌లైన్‌లో ఫారమ్‌ను పూర్తి చేసే ప్రక్రియ లో
రూ.100 చెల్లించాల్సి ఉంది. అభ్యర్థులు మే 4 వరకు ఆన్‌లైన్ ఫీజు చెల్లించ వచ్చు.
SSC CGL 2023 కోసం ఇలా అప్లై చేసుకోండి:
ఇక ఈ పోస్టులకి ఎలా అప్లై చెయ్యాలనేది చూస్తే.. ముందు ssc.nic.in లోకి వెళ్ళండి.
ఇప్పుడు మీరు హోమ్ పేజీ లో రిలీజిస్ట్రేషన్ లింక్ పైన నొక్కండి.
పోర్టల్ లోకి లాగిన్ అయ్యి SSC CGL 2023 కి అప్లై చేయండి.
డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి ఫీజు కట్టేసి సబ్మిట్ చేయండి.
అంతే సబ్మిట్ చేస్తే సరి పోతుంది.