UPSC నోటిఫికేషన్ విడుదల… పూర్తి వివరాలు ఇవే…!

-

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కోసం ఎదురు చూస్తున్నారా…? అయితే మీకు గుడ్ న్యూస్. తాజాగా యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్-UPSC జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.

ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే… మొత్తం 89 ఖాళీలు వున్నాయి. దీని కోసం దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. 2021 మార్చి 18 దరఖాస్తు చేయడానికి ఆఖరి తేదీ. పూర్తి వివరాల కోసం https://www.upsc.gov.in/ లో తెలుసుకోవచ్చు. ఆసక్తి గల అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి.

మొత్తం ఖాళీలు 89 ఉండగా… పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు 43, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టులు 26, అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ (సివిల్) పోస్టులు 10, ఎకనమిక్ ఆఫీసర్ పోస్టు 1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బాలిస్టిక్స్) పోస్టు 1, ప్రోగ్రామర్ గ్రేడ్ ఏ పోస్టు 1, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (బయాలజీ) పోస్టులు 2, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (కెమిస్ట్రీ) పోస్టులు 2, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (డాక్యుమెంట్స్) పోస్టులు 2, సీనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ (లై డిటెక్షన్) పోస్టు 1.

వయస్సు గరిష్టంగా 35 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీస్ అభ్యర్థులకు వయస్సు లో సడలింపు ఉంటుంది. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి గమనించండి. ఎంపికైన వారికి కేంద్ర ప్రభుత్వ 7వ వేతన స్కేల్ వర్తిస్తుంది. దరఖాస్తు ఫీజు రూ.25. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు లేదు. విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news