UPSC Job Notification : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల భర్తీకి మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూ్రెన్స్ కార్పొరేషన్ (ఈఎస్‌ఐ) ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 151 ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈఎస్‌ఐసీ సంస్థలో డిప్యూటీ డైరెక్టర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 2021 సెప్టెంబర్ 2 చివరి తేదీ. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.upsc.gov.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. అభ్యర్థులు https://upsconline.nic.in/ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాలి. జాబ్స్ నోటిఫికేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.
- విద్యార్హతలు– దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పాస్ కావాలి.
- అనుభవం– ఏదైనా ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలో అకౌంట్స్, మార్కెటింగ్, ఇన్సూరెన్స్
- పబ్లిక్ రిలేషన్ విభాగాల్లో కనీసం 3 ఏళ్లు అనుభవం ఉండాలి.
- వయస్సు– 35 ఏళ్లు.
- దరఖాస్తు ఫీజు– రూ.25.
- ఎంపిక విధానం– రాతపరీక్ష, ఇంటర్వ్యూ
- పరీక్షా విధానం– పరీక్ష రెండు గంటలు ఉంటుంది.
అభ్యర్థులు ముందుగా https://upsconline.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
అభ్యర్థి తన వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
దరఖాస్తు ఫామ్ పూర్తి చేసిన తర్వాత ఫీజు చెల్లించాలి.
దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకొని భద్రపర్చుకోవాలి.