ఎస్టీ విద్యార్థులకు సర్కార్ గుడ్ న్యూస్ .. !

కరోనా తో పాఠశాలలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులంతా పాఠశాల విద్యకు దూరమయ్యారు. దాంతో ప్రభుత్వం ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తోంది. అయితే ఆన్లైన్ విద్య కూడా పేద విద్యార్థులకు అందని ద్రాక్షగానే మారింది. ముఖ్యంగా గిరిజన విద్యార్థులకు మొబైల్ ఫోన్లు అందుబాటులో లేకపోవడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆన్ లైన్ క్లాసులకు హాజరు కాలేక పోతున్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ గిరిజన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.

Good news for st students
Good news for st students

గిరి దర్శిని అభ్యాసిక పేరుతో గిరిజన విద్యార్థులకు ఇంటి వద్దకే పోస్ట్ ద్వారా పాఠశాల పుస్తకాలను స్టడీ మెటీరియల్ ను పంపించాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా విద్యార్థులు నేర్చుకున్న అంశాలను వర్క్ షీట్ రూపంలో ప్రతి నెల పోస్ట్ ద్వారా పాఠశాలకు పంపించాలని తెలిపింది. గిరిజన విద్యా శాఖ తీసుకున్న నిర్ణయంతో విద్యార్థులకు కొంత వరకు మేలు జరిగే అవకాశం ఉంది. అయితే పోస్టు ద్వారా వర్క్ షీట్ లు పంపించడం అనేది గిరిజన ప్రాంతాల్లో అంత సులువైన పని కాదు. కాబట్టి విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు వినేందుకు స్మార్ట్ ఫోన్ లు ఇచ్చి ఉంటే బాగుండేదని విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు.