హైదరాబాద్ సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) లో ఖాళీలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (SPMCIL) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ ని విడుదల చేయడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

భారత ప్రభుత్వానికి చెందిన ఈ ప్రింటింగ్ ప్రెస్ హైదరాబాద్‌లో ఉంది. మొత్తం 15 ఖాళీలు ఉన్నాయి. సూపర్‌వైజర్, ల్యాబరేటరీ అసిస్టెంట్, ఎంగ్రేవర్ లాంటి పోస్టులు దీనిలో వున్నాయి. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 27 చివరి తేదీ. వేరు వేరు పోస్టులకి వేరు వేరు అర్హతలు వున్నాయి. వాటి వివరాలను నోటిఫికేషన్ లో చూడచ్చు.

2022 జనవరి లేదా ఫిబ్రవరి లో ఆన్‌లైన్ టెస్ట్ ఉంటుంది. అదే విధంగా ట్రేడ్ టెస్ట్ 2022 మార్చి లేదా ఏప్రిల్ లో ఉంటుంది. ఇక వయస్సు విషయానికి వస్తే.. 18 నుంచి 30 ఏళ్లు వయస్సు ఉండాలి. రాతపరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయనున్నారు. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే..

ముందుగా http://igmhyderabad.spmcil.com ఓపెన్ చేయాలి.
దరఖాస్తు చేయాలనుకునే పోస్టుపై క్లిక్ చేయాలి.
ఇప్పుడు మీకో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయడానికి లాగిన్ చేయాలి.
లాగిన్ అయిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది.
పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలనివ్వాలి.
రెండో స్టేజ్‌లో ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.
తరవాత మిగిలిన వివరాలని కూడా ఇచ్చేయాలి.
దరఖాస్తు ఫీజు చెల్లించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి చేయాలి అంతే.

ఎంట్ర‌న్స్ ప‌రీక్ష‌ల కోసం ప్రిపేర్ అవుతున్నారా?? ప్ర‌భుత్వోద్యోగం మీ ల‌క్ష్య‌మా.. అయితే Manalokam’s Vijayapatham.com వెబ్‌సైట్‌లో ప్రాక్టీస్ బిట్స్ , ఆన్‌లైన్ ఎగ్జామ్స్ ద్వారా మీ నాలెడ్జ్‌ను పెంచుకోండి. మ‌రెన్నో ఇంట్రెస్టింగ్, వింత‌లు విశేషాలు, ప్రేర‌ణాత్మ‌క‌ క‌థ‌నాల కోసం మ‌న‌లోకం.కామ్ ని ఫాలో అవ్వండి.

Read more RELATED
Recommended to you

Latest news