మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ లో ఖాళీలు వున్నాయి. నోటిఫికేషన్ ని కూడా విడుదల చేసారు. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. డిప్యూటీ రిజిస్ట్రార్, అసిస్టెంట్ రిజిస్ట్రార్, టెక్నికల్ సూపరింటెండెంట్ వంటి వాటిలో 95 పోస్టులను భర్తీ చేయనున్నారు.
దరఖాస్తు చేసుకొనే అభ్యర్థుల వయసు 21 ఏళ్ల నుంచి 51 ఏళ్ల మధ్య ఉండాలి. అలానే పోస్టుకు సంబంధించిన విద్యార్హతతో పాటు పలు పోస్టులకు అనుభవం ఉండాలి. ఆసక్తి వున్నవారు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తుకు నవంబర్ 16, 2021 వరకు అవకాశం ఉంది. కనుక ఈ లోగ అప్లై చేసుకోచ్చు. నోటిఫికేషన్, అర్హతల వివరాల కోసం అధికారికి వెబ్‌సైట్ https://www.iitk.ac.in/ ను చూడచ్చు. అభ్యర్థులకు రాత పరీక్ష ఉంటుంది. దాని ద్వారా ఎంపిక చేస్తారు. సెమినార్ ప్రజంటేషన్, స్కిల్ టెస్ట్ ని కూడా నిర్వహిస్తారు. ఈ రౌండ్‌లలో పాసైన వారిని ఇంటర్వ్యూ చేస్తారు.
అర్హత ఉన్న పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి https://oag.iitk.ac.in/Oa_Rec_Pg/ లింక్ ని ఓపెన్ చెయ్యాలి.
నెక్స్ట్ మీరు Register NewUser ఆప్షన్ లోకి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తరువాత పోస్టుల ఆధారంగా రూ.500, లేదా రూ.200 ఫీజు చెల్లించాలి.
ఎస్సీ,ఎస్టీ, పీడబ్ల్యూడీ, మహిళా అభ్యర్థులుకు ఫీజు మినహాయింపు ఉంది గమనించండి.
దరఖాస్తులను పంపడానికి చిరునామా:
Recruitment Section Room no. 224
Faculty Building 2nd Floor
IIT Kanpur (UP) -208016
అడ్రస్‌కు పంపాలి.