ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో ఖాళీలు… పూర్తి వివరాలివే …!

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన న్యూఢిల్లీలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ లో కొన్ని ఖాళీలు వున్నాయి. ఆసక్తి, అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు.

ఇక దీని కోసం పూర్తి వివరాలను చూస్తే… దీనిలో మొత్తం 19 ఖాళీలు వున్నాయి. ఇక పోస్టుల వివరాలను చూస్తే.. ఈ నోటిఫికేషన్ ద్వారా సూపరింటెండింగ్‌ ఇంజనీరింగ్, మెడికల్ ఆఫీసర్‌, ప్రిన్సిపల్ టెక్నికల్ ఆఫీసర్‌, చీఫ్‌ సెక్యురిటీ ఆఫీసర్‌ వంటి పోస్టులను భర్తీ చేస్తున్నారు.

ఇక అర్హత వివరాలను చూస్తే ఇంజనీరింగ్‌/టెక్నాలజీ విభాగాల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన కోర్సులో ప్యాస్ అయినవాళ్లు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. దానితో పాటుగా అనుభవం కూడా ఉండాలి. వయస్సు వివరాలను చూస్తే.. వయస్సు 40 నుంచి 55 యేళ్ల మధ్య ఉండాలి.

పోస్టులకి అప్లై చేసుకోవడానికి నవంబర్‌ 30, 2022వ తేదీ సాయంత్రం 5 గంటల దాకా అవకాశం వుంది. అప్లికేషన్ ఫీజు గురించి చూస్తే.. జనరల్ అభ్యర్ధులు రూ.500లు పే చెయ్యాలి. ఎస్సీ/ఎస్టీ/పడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్‌, మహిళా అభ్యర్ధులకు ఫీజు లేదు. పూర్తి వివరాలను https://home.iitd.ac.in/ లో చూడచ్చు.

చిరునామా: The Recruitment Cell, Room No. 207/C-7, Adjoining to Dy. Director (Ops)’s Office, IIT Delhi, Hauz-Khas, New Delhi – 110016.