ఎస్‌బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష వాయిదా..!

-

దేశ వ్యాప్తంగా 5454 జూనియర్ అసోసియేట్ పోస్టులని భర్తీ చేయడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
దరఖాస్తుల్ని స్వీకరించింది. రఖాస్తు గడువు 2021 మే 17న ముగిసింది. మామూలుగా అయితే పరీక్షలు జూన్ లో జరగాల్సి వుంది. కానీ కరోనా నేపధ్యం లో . జూన్‌లో పరీక్షలు జరగాల్సి ఉండగా పరీక్షలు వాయిదా పడ్డాయి. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

తాజాగా ఈ విషయం ఎస్‌బీఐ ప్రకటించింది. జూన్‌ లో జరగాల్సిన జూనియర్ అసోసియేట్ ప్రిలిమినరీ ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్టు అంది. తదుపరి నోటీసు జారీ చేసే వరకు ఎగ్జామ్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. డిగ్రీ అర్హతతో ఎస్‌బీఐ 5454 పోస్టుల్ని ఎస్బీఐ భర్తీ చేస్తోంది. ఇప్పుడు పరిస్థితులు బాగోక పోవడం తో జూన్‌లో పరీక్ష జరిగే అవకాశం లేదు
అందుకే ప్రిలిమ్స్ వాయిదా పడటంతో మెయిన్స్ కూడా వాయిదా వేశారు.

హైదరాబాద్ సర్కిల్‌లో 275 పోస్టులు ఉన్నాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన అప్‌డేట్స్, అడ్మిట్ కార్డుల విడుదల లాంటి వివరాలను అభ్యర్థులు https://www.sbi.co.in/web/careers లేదా https://bank.sbi/web/careers వెబ్‌సైట్లలో
చూడచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news