ఎలాంటి సెక్యూరిటీ లేని పర్సనల్‌ లోన్‌!

కరోనా నేపథ్యంలో దాదాపు ప్రతి ఒక్కరూ ఆర్థికంగా భారం పడిన వారే ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని బ్యాంకులు ఇప్పటికే పర్సనల్‌ లోన్‌ల వెసులుబాటును అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా భారత అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా చికిత్స కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పర్సనల్‌ లోన్లు ఇస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖారా వెల్లడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కరోనా నేపథ్యంలో ఒకరినొకరు ఆర్థికంగా సాయం చేసుకోలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అందుకే ఈ సంక్షోభంలో నుంచి తమ ఖాతాదారులకు బయట పడవేయటానికి ఓ అద్భుతమైన ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.


కొవిడ్‌ చికిత్స కోసం ఎలాంటి సెక్యూరిటీ లేకుండా పర్సనల్‌ లోన్లు ఇస్తామని ఎస్‌బీఐ చైర్మన్‌ దినేష్‌ ఖారా వెల్లడించారు. ఇండియన్‌ బ్యాంక్స్‌ అసోసియేషన్‌ (ఐబీఏ) చైర్మన్‌ రాజ్‌ కిరణ్‌ రాయ్, ఐబీఏ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ సునీల్‌ మెహతాతో కలిసి ఎస్‌బీఐ చైర్మన్‌ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. తమ ఎస్‌బీఐ బ్యాంకులే కాక అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులన్నీ ఈ రుణాలు మంజూరు చేస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ గ్యారంటీ స్కీం కింద ఈ లోన్‌ను అందించనున్నారు. లోన్‌ కనిష్టంగా రూ.25000 నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు ఇస్తామన్నారు.అయితే, ఈ లోన్‌పై కేవలం
8 శాతం వడ్డీ వసూలు చేస్తుందని తెలిపారు.