మాగంటి బాబు రెండో కుమారుడు మృతి… అసలు హోటల్ లో ఏం జరిగింది…?

ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు రెండవ కుమారుడు మాగంటి రవీంద్రనాద్ చౌదరి ( రవీంద్ర) నిన్న సాయంత్రం తుది శ్వాస విడిచారు. తాగుడు అలవాటును తప్పించడానికి ఆసుపత్రిలో ట్రీట్ మెంట్ అందిస్తుండగా అక్కడి నుంచి ఆరోగ్యం విషమించింది. మద్యానికి బానిస అయిన రవీంద్ర ను హాస్పిటల్ లో కుటుంబ సభ్యులు జాయిన్ చేయించారు. ఆసుపత్రి నుంచి తప్పించుకుని వచ్చి ఓ హోటల్ లో రవీంద్ర ఉన్నారు.

బ్లడ్ వామిటింగ్ తో హయత్ ప్యాలెస్ లో చనిపోయారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. నిన్న సాయంత్రం పార్క్ హోటల్ లో ఆయన 4 గంటలకు ఖాళీ చేయాల్సి ఉండగా 6 గంటల వరకు ఖాళీ చేయలేదు. ఆ సమయంలో మేనేజర్ వెళ్లి వేరే తాళంతో లాక్ ఓపెన్ చేసి చూడగా బాత్ రూమ్ లో రక్తపు మడుగులో ఉన్నారని గుర్తించారు. దీనితో పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.