SSC GD Constable Recruitment 2021 : నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. 25, 271 జీడీ కానిస్టేబుల్ పోస్టులు..!

-

ఉద్యోగం కోసమా చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. 25,271 జీడీ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఎస్‌ఎస్‌సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి వారు ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency
ఏరోనాటికల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ | Aeronautical Development Agency

వీటిలో 10 శాతం ఉద్యోగాలు ఎక్స్​ సర్వీస్​మెన్ కోసం కేటాయించడం జరిగింది. అభ్యర్థులు వయసు 2021 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 23 ఏళ్ల మధ్యలో ఉండాలి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకి మొదట కంప్యూటర్‌ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. దరఖాస్తులు ప్రారంభం.. జూలై 17, 2020. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ ఆగస్టు 31,2021.

ఇక పోస్టుల వివరాలలోకి వెళితే.. బీఎస్ఎఫ్ – 7545, సీఐఎస్‌ఎఫ్ – 8464, ఎస్‌ఎస్‌బీ – 3806, ఐటీబీపీ – 1431, ఏఆర్ – 3785, ఎస్‌ఎస్‌ఎఫ్ – 240 కానిస్టేబుళ్ల నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇందులో పురుషులకు 22,424 పోస్టులు, మహిళలకు 2847 పోస్టులు వున్నాయి.

ఉద్యోగానికి ఎంపికైన వారికి గ్రేడ్ 3 లెవల్​ కింద రూ. 21,700-రూ. 69,100 వరకు జీతం ఉంటుంది. ఇక, పరీక్ష తేదీలను ఇంకా ప్రకటించలేదు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 100 రూపాయాల ఫీజు చెల్లించాలి. మహిళలు, ఎస్సీ, ఎస్సీ కేటగిరీ వారు, ఎక్స్​ సర్వీస్​మెన్ కోటా వారికి ఫీజు మినహాయింపు ఉంది. దరఖాస్తు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ సెప్టెంబర్ 2, 2021

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్ https://ssc.nic.in/ లో తెలుసుకోవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news