చదవడానికి చాలా సిలబస్ ఉంటుంది. కానీ చదువుకోవడానికి ఆసక్తి రాదు. లేదా ఇంట్రెస్టింగ్ గా ఒక పది నిమిషాలు చదివితే ఇంకా అసలు చదవలేక పోతారు. అయితే ఎక్కువ సేపు చదువుకోవాలంటే ఎలా…?, ఏ పద్ధతుల్ని అనుసరిస్తే ఎక్కువ సేపు చదవగలరు….? ఇలా అనేక విషయాలు మీకోసం. మరి ఆలస్యమెందుకు పూర్తిగా చూసేయండి. చదవాలని చూస్తే సిలబస్ ఎక్కువ ఉంటుంది కానీ చదువుకోడానికి అస్సలు ఆసక్తి రాదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే..?
ఎందుకు చదువుకోవాలి అనే దానికి సమాధానం చెప్పడం;
ఎప్పుడైతే ఇప్పుడు నేను ఎందుకు చదువుకోవాలి…? అని ప్రశ్నించుకుంటే అప్పుడు చదవడానికి ఆసక్తి ఉంటుంది. దీనికి గల కారణాలు తెలిస్తే ఇంట్రెస్ట్ ఆటోమేటిక్ గా వస్తుంది. దీంతో మీరు ఎక్కువ సేపు చదవగలరు.
నచ్చిన వాటిని చదవడం:
ముందు మీకు ఏ అంశాలను అయితే చదవాలి అనిపిస్తుందో వాటిని ముందు చదవండి. దీంతో మీకు నచ్చిన పుస్తకాలను మీరు ఎంతో వేగంగా పూర్తి చేయవచ్చు. ఖచ్చితంగా చదవాలని కాకుండా ఇష్టపడి చదివితే ఎక్కువ సేపు చదవగలరు.
ఒక టైమ్ ఫిక్స్ చేసుకోండి:
పుస్తకాన్ని ఫలానా టైమ్ లో కంప్లీట్ చేయాలి అని ఒక డెడ్ లైన్ మీరు ఏర్పాటు చేసుకోండి అప్పుడు మీలో మీకు మోటివేషన్ వచ్చి వేగంగా చదవగలరు.
నిశ్శబ్దంగా ఉన్న ప్రదేశాన్ని ప్రిఫర్ చేయండి:
హాల్లో, టీవీ రూమ్ లో కాకుండా ఇంట్లో ఎవరూ లేని చోట ఫ్రీగా సైలెంట్ గా కూర్చొని చదువుకుంటే ఎక్కువసేపు చదవచ్చు. దీని వల్ల మూడ్ మారిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.