ఇంటర్‌మీడియట్ మొదటి సంవత్సరం ప్రవేశాల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించింది. దీని ప్రకారం రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల జానియర్ కాలేజీల్లో మొదటి విడుత ప్రవేశాలు మే 21 నుంచి ప్రారంభం. అంటే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమవుతుంది. జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. జూలై 1తో మొదటి విడుత ప్రవేశాల ప్రకియ పూర్తవుతుంది.
ప్రవేశ ప్రక్రియకు సంబంధించి ఇంటర్ బోర్డు స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిలో భాగంగా రిజర్వేషన్లు పాటించాలని, ఒక్కో సెక్షన్‌లో 88 మంది విద్యార్థులు మించరాదని పేర్కొంది. కాలేజీల్లో ప్రవేశాల కోసం ఎటువంటి ప్రవేశ పరీక్షలు నిర్వహించరాదని తెలిపింది. పూర్తి వివరాలు కింది పీడీఎఫ్‌లో చూడవచ్చు.
– కేశవ