IGNOU లో కొత్తగా రెండు మాస్టర్​ డిగ్రీ ప్రోగ్రామ్స్​.. వివరాలివే..!

-

ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (ఇగ్నో IGNOU) ఎన్నో రకాల కోర్సులని ఆఫర్ చేస్తోంది. అయితే తాజాగా రెండు మాస్టర్​ డిగ్రీ ప్రోగ్రామ్స్​ను మొదలు పెట్టింది ఇగ్నో. ఇక ఈ కోర్సులకి సంబంధించి పూర్తి వివరాలలోకి వెళితే..

కొత్తగా రెండు మాస్టర్​ డిగ్రీ ప్రోగ్రామ్స్​ ని స్టార్ట్ చేసారు. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ, మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వంటి రెండు కొత్త కోర్సుల కోసం దరఖాస్తులు చేస్తోంది. ఇక ఈ కోర్సుల వివరాలాలని చూసేస్తే.. మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్​ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ప్రోగ్రామ్‌ వలన విద్యార్ధులకి బెనిఫిట్ కలుగుతుంది.

ఈ ప్రోగ్రామ్​ను స్కూల్​ ఆఫ్​ వొకేషనల్​ ఎడ్యుకేషన్​ అండ్ ట్రైనింగ్​ నిర్వహిస్తోంది. గ్రాడ్యేయేట్లకు ఇన్ఫర్మేషన్​ సెక్యూరిటీలో అత్యుత్తమ బోధన, పరిశోధన అందించే లక్ష్యంతో దీనిని తీసుకు రావడం జరిగింది.ఇది ఇంగ్లీష్​లోనే ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం / ఇన్​స్టిట్యూట్ నుండి బ్యాచిలర్ డిగ్రీ లేదా మరేదైనా సమాన అర్హత ఉండాలి. ఈ ప్రోగ్రామ్​ మొత్తం ఫీజు రూ. 43,200. అంటే విద్యార్థులు ప్రతి సంవత్సరం రూ. 21,600 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఇక మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ ఇన్​ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రోగ్రామ్​ గురించి చూస్తే.. ఈ ప్రోగ్రామ్​ను స్కూల్ ఆఫ్ వోకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అందిస్తోంది. విద్యార్థులు తమ సొంత వ్యాపార సంస్థను నెలకొల్పేందుకు అవసరమైన స్కిల్స్ ని ఇది ఇస్తుంది.

ఈ కోర్సును కేవలం ఇంగ్లీష్​లోనే అందిస్తున్నారు. సెల్ఫ్ ఇన్​స్ట్రక్షనల్​ ప్రింటెడ్​ మెటీరియల్, ఆడియో వీడియో ప్రోగ్రామ్స్​, ఫేస్​ టు ఫేస్​ కౌన్సెలింగ్ మొదలైనవి ఉంటాయి. బ్యాచిలర్ డిగ్రీ పూర్చి చేసిన వాళ్ళు అర్హులు. రెండేళ్ల ఈ ప్రోగ్రామ్​ మొత్తానికి రూ. 15,000 ఫీజు చెల్లించాలి.

అంటే ప్రతి ఏటా రూ.7,500 ఫీజు చెల్లించాలి. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు www.ignouadmission.samarth.edu.in వెబ్​సైట్​ ద్వారా ఈ నెల 31లోపు దరఖాస్తు చేసుకోవాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version