తెలంగాణ‌ పదోతరగతి ఫలితాలు ఎప్పుడంటే…?

-

ప్రతి విద్యార్థి గ్రేడ్‌లను ఒకటికి రెండుసార్లు చెక్‌చేసి ఫలితాలు విడుదల చేస్తామని, ఏ సబ్జెక్టులోనైనా సున్నా వస్తే రీచెక్ చేసిన తర్వాతే ఫైనల్ చేస్తామని విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్ స్పష్టం చేశారు.

పదోతరగతి ఫలితాల కోసం లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తున్నారు. పదోతరగతి పరీక్ష పత్రాల వాల్యూయేషన్ ఏప్రిల్ 27కే పూర్తయింది. కానీ ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పుల నేపథ్యంలో పదోతరగతి ఫలితాల పై చాలా జాగ్రత్తలను విద్యాశాఖ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఫలితాల విడుదల మరింత ఆలస్యం కానున్నది. ఇందులో భాగంగా ఒకటికి రెండుసార్లు పరిశీలించిన తర్వాతే ఫలితాలను వెల్లడించనున్నారు. ఫలితాలను పాఠశాలల హెడ్‌మాస్టర్లకు కూడా పంపనున్నారు. అన్ని ప్రక్రియలు పూర్తయితే మే రెండో వారం చివర లేదా మూడోవారం ప్రారంభంలో ఫలితాలు విడుదల కావచ్చు.

ప్రతి విద్యార్థి గ్రేడ్‌లను ఒకటికి రెండుసార్లు చెక్‌చేసి ఫలితాలు విడుదల చేస్తామని, ఏ సబ్జెక్టులోనైనా సున్నా వస్తే రీచెక్ చేసిన తర్వాతే ఫైనల్ చేస్తామని విద్యాశాఖ కమిషనర్ విజయకుమార్ స్పష్టం చేశారు. ఆలస్యం అయినా తప్పులు లేకుండా కచ్చితమైన ఫలితాలను వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఎటువంటి సందేహాలు ఉన్నా నేరుగా విద్యాశాఖకు ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రులు, విద్యార్థులు ఎటువంటి ఆందోళన చెందవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ఫలితాల వెల్లడిలో జాప్యం.. అన్ని అడ్మిషన్లకు శాపం

పదోతరగతి ఫలితాల వెల్లడిలో జాప్యం మరింత ఎక్కువ కావడంతో ఉన్నత విద్యా ప్రవేశాలలో జాప్యం జరుగుతుంది. ఇప్పటికే పాలీసెట్ ఫలితాలు వచ్చినా పదోతరగతి ఫలితాలు రాకపోవడంతో ప్రవేశాల ప్రక్రియ మరింత ఆలస్యం కానున్నది. అదేవిధంగా బాసర ట్రిపుల్ ఐటీ, ఇంటర్‌మీడియట్, వొకేషనల్ తదితర కోర్సుల్లో ప్రవేశాలు ఆలస్యం కానున్నాయి. ఆయా ప్రవేశాల తేదీలను, దరఖాస్తు తేదీలను పొడిగిస్తున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version