షూటింగ్ సందర్భంగా రామ్‌చరణ్ కాలికి గాయం అయినప్పటికీ అతను విశ్రాంతి తీసుకోకుండా, గాయాన్ని పట్టించుకోకుండా దాన్ని ఇంకా పెద్దదిగా చేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది.
బాహుబలి తరువాత దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం విదితమే. కాగా ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రామ్ చరణ్ కాలికి గాయం కూడా అయింది. దీంతో షూటింగ్‌ను నిలిపివేశారు. రెండు వారాల పాటు షూటింట్ను వాయిదా వేస్తున్నట్లు గతంలో ప్రకటించారు. అయితే ఓ వైపు గాయం బారిన పడినప్పటికీ రామ్ చరణ్ అదేమీ పట్టించుకోకుండా జాలీగా తిరుగుతున్నాడట. దీంతో ఈ విషయంపై రాజమౌళి కొంత అసహనానికి లోనవుతున్నట్లు తెలిసింది.
షూటింగ్ సందర్భంగా రామ్‌చరణ్ కాలికి గాయం అయినప్పటికీ అతను విశ్రాంతి తీసుకోకుండా, గాయాన్ని పట్టించుకోకుండా దాన్ని ఇంకా పెద్దదిగా చేసుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే ఇదే విషయంపై సోషల్ మీడియాలోనూ పలు వార్తలు వస్తున్నాయి. ఇక రామ్‌చరణ్ ఇటీవలే మెగా అభిమానులతో కలిసి దిగిన ఓ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఓవైపు కాలి గాయం ఉంటే రెస్ట్ తీసుకోవాల్సింది పోయి, రామ్ చరణ్ ఇలా చేస్తున్నాడేంటని.. దర్శకుడు రాజమౌళి ఇబ్బందికి గురవుతున్నారట.
రామ్‌చరణ్ కాలికి గాయం ఉన్నప్పటికీ దాన్ని పట్టించుకోకుండా ఉంటున్నాడని, రెస్ట్ తీసుకోవడం లేదని తెలిసి దర్శకుడు రాజమౌళి అసహనానికి గురవుతున్నారట. అలాగే రామ్‌చరణ్‌తోపాటు అటు ఎన్టీఆర్ చేతికి కూడా గాయం అయిన నేపథ్యంలో ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ మరింత వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రాజమౌళికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. ఓ వైపు సినిమాను వేగంగా షూట్ చేసి వచ్చే ఏడాది జూలైలో విడుదల చేయాలని ప్లాన్లు వేసుకుంటే.. ఇలా ఇద్దరికి అయిన గాయాల వల్ల చిత్రం విడుదల ఆలస్యం అవుతుందేమోనని రాజమౌళి ఆందోళన పడుతున్నారట. అలాగే ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకుని చిత్ర షూటింగ్ పూర్తి చేయాలని అనుకుంటే.. ఇలా ఎన్టీఆర్, రామ్‌చరణ్ ఇద్దరూ గాయాల బారిన పడడం, సినిమా షూటింగ్ ఆగిపోవడంపై రాజమౌళి కొంత ఇబ్బందికి కూడా గురయ్యారట. మరి వీరి గాయాలు ఎప్పుడు మానుతాయో, తిరిగి ఆర్ఆర్ఆర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందో వేచి చూస్తే తెలుస్తుంది..!