‘ఎమ్మెల్యేలకు ఎర’..పాన్ ఇండియా సినిమా?

-

తెలంగాణ రాజకీయం మసాలా మాదిరిగా బాగా ఘాటుగా తయారైందని చెప్పొచ్చు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ…మైండ్ గేమ్ ఆడుతూ..ప్రత్యర్ధులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా పార్టీలు ముందుకెళుతున్నాయి. ఈ క్రమంలోనే టీఆర్ఎస్-బీజేపీల మధ్య వార్ ఏ స్థాయిలో నడుస్తోందో చెప్పాల్సిన పని లేదు. రెండు పార్టీల మధ్య ఉప్పు-నిప్పుడు మాదిరిగా పోరు జరుగుతుంది. ఈ క్రమంలో ఎవరికి వారు పైచేయి సాధించడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు.

అయితే ఎక్కువ ఊపులో ఉన్న బీజేపీ..టీఆర్ఎస్ లక్ష్యంగా దూసుకెళుతుంది..ఇదే సమయంలో టీఆర్ఎస్ నేతలని లాగేయడం, కేసీఆర్‌పై అవినీతి ఆరోపణలు ముమ్మరం చేయడం, లిక్కర్ స్కామ్‌లో కవిత పేరు వినిపించడంతో ఈ అంశాన్ని రాజకీయంగా బాగా వాడుకుంటూ ముందుకెళుతుంది. ఇక బీజేపీకి చెక్ పెట్టే క్రమంలో టీఆర్ఎస్ సైతం రివర్స్ స్ట్రాటజీతో..టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి వెళ్ళిన వారిని..మళ్ళీ టీఆర్ఎస్‌లోకి లాగేయడం..ఓ వైపు మునుగోడులోప పై సాధించే దిశగా వెళ్ళడం. ఊహించని విధంగా నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు అంశాన్ని కీలక అస్త్రంగా మార్చుకున్నారు.

ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు…వారు బీజేపీ వాళ్ళు అని టీఆర్ఎస్ ఫైర్ అవుతుంది. అయితే ఈ అంశాన్ని ఇంకా ఎక్కువ చేసేలా టీఆర్ఎస్ ప్రయత్నిస్తుంది. ఇప్పటికే కేసీఆర్..ఇంకా సినిమా చాలా ఉందని చెప్పుకొచ్చారు. ఇక తాజాగా కేటీఆర్ సైతం…ఎమ్మెల్యేలకు ఎర అనే సినిమాని పాన్ ఇండియా రేంజ్‌లో చూపిస్తామని, దీనికి సంబంధించిన ఆడియో, వీడియోలు ఓ రేంజ్‌లో ఉంటాయని అంటున్నారు.

అయితే మునుగోడు ఉపఎన్నిక తర్వాత ఈ అంశాన్ని టీఆర్ఎస్ తెరపైకి తెచ్చే ఛాన్స్ ఉంది. కాకపోతే పాన్ ఇండియా సినిమా అంటూ హడావిడి చేసేస్తున్నారు. మరి ఇందులో ఎలాంటి సంచలన విషయాలు బయటపడతాయనేది పెద్ద హాట్ టాపిక్ అయింది. నిజంగానే సంచలన విషయాలు ఉన్నాయా? లేక టీఆర్ఎస్ హడావిడి చేస్తుందనేది క్లారిటీ లేదు. ఇక టీఆర్ఎస్ ఎలా చేసిన..దానికి కౌంటర్ ఎటాక్ ఇవ్వడానికి బీజేపీ రెడీ అవుతుంది. ఈ మునుగోడు ఉపఎన్నిక తర్వాత పోరు మరింత రసవత్తరం కానుంది.

ReplyForward

Read more RELATED
Recommended to you

Latest news