త్వరలోనే భారత ప్రధాని మోడీ చైనా అధ్యక్షుడితో ముఖాముఖి తలపడనున్నాడు..ఇండో-చైనా సరిహద్దు వివాదం నేపథ్యంలో చైనా సోషల్ మీడియా యాప్స్‌పై బ్యాన్ విధించిన తర్వాత ఇరు దేశాల అధినేతలు ఒకే వేదికపైకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది..నవంబరు 17న జరగనున్న బ్రిక్స్ వార్షిక సదస్సు రెండు అగ్రదేశాల నేతల భేటికీ వేదిక కానుంది..”ప్రపంచ సుస్థిరతకు, భద్రతకు, వినూత్న అభివృద్ధికి బ్రిక్స్ భాగస్వామ్యం” అనే అంశంపై వార్షిక సదస్సు జరగనున్నట్లు రష్యా ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈసారి బ్రిక్స్ సమావేశాలకు రష్యా అధ్యక్షత వహించనుంది..సోమవారం వార్షిక సదస్సు తేదీలను ప్రకటిస్తూ, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ వార్షిక సమావేశాలు జరుగుతాయని తెలిపింది.. ప్రపంచ జనాభాలో దాదాపు సగానికిపైగా జనాభాకు బ్రిక్స్ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి..దీంతో ప్రపంచదేశాలు ఇప్పడు బ్రిక్స్ కూటమి భేటీపై ఆసక్తితో ఎదురు చూస్తున్నాయి..కరోనాతో ప్రపంచం దేశాల ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడంతో ఇప్పుడు బ్రిక్స్ దేశాలు ఎలాంటి తీర్మానాలు చేస్తాయోనని ఆసక్తిగా చూస్తున్నాయి.
గత కొన్నేళ్ళుగా బ్రిక్స్ అన్ని సదస్సులకు మోడీ, జిన్‌పింగ్ హాజరవుతూ వస్తున్నారు..గతేడాది బ్రసీలియాలో జరిగిన బ్రిక్స్ సదస్సుకు హాజరైన ఇరువురు నేతలు ద్వైపాక్షిక సమావేశం కూడా జరిపారు.. కాగా ఈ ఏడాది మే నుండి భారత్, చైనాల మధ్య తీవ్రంగా సరిహద్దు ప్రతిష్టంభన నెలకొంది. దీంతో ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి. వివాదాన్ని పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల దౌత్య, సైనికాధికారులు పలుసార్లు సమావేశాలు జరిపారు. అయినా ఎలాంటి పురోగతి సాధించలేదు. శాంతి, సుస్థిరత, ఆర్థిక వ్యవస్థ, సాంస్కృతిక, ప్రజల మధ్య సంబంధాలు వంటి మూడు ప్రధాన అంశాలపై ఐదు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యం ఈ ఏడాది కూడా కొనసాగుతుందని భావిస్తున్నట్లు రష్యా పేర్కొంది. బ్రిక్స్ భాగస్వామ్య దేశాల మధ్య సహకారం మరింత బలోపేతం కావడానికి, సభ్య దేశాల సంక్షేమానికి ఈ సదస్సు మరింత ఉత్తేజాన్ని ఇవ్వగలదని ఆశిస్తున్నట్లు తెలిపారు.
వచ్చే నెలలో జిన్‌పింగ్‌తో మోడీ ఫేస్ టు ఫేస్..!
-