గుజరాత్ పోల్: ట్రైయాంగిల్ ఫైట్..ఎడ్జ్ ఆ పార్టీకే!

-

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది..మొత్తం 182 స్థానాలు ఉన్న గుజరాత్‌లో ఎన్నికలు రెండు విడతల్లో జరగనున్నాయి. మొదట విడత డిసెంబర్ 1, రెండోవిడత 5న జరగనున్నాయి. మొదట విడతలో 89 స్థానాలకు, రెండో విడతలో 93 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 8న ఫలితాలు వెలువడనున్నాయి. అయితే గుజరాత్ ఎన్నికలు ఈ సారి హోరాహోరీగా సాగనున్నాయి.

ఇక్కడ ఎప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఫైట్ జరిగేది..వరుసపెట్టి బీజేపీ విజయం సాధిస్తూ వస్తుంది. గత 2017 ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు గెలుచుకోగా, కాంగ్రెస్‌కు 77 సీట్లు వచ్చాయి. ఇతరులు 6 సీట్లు గెలుచుకున్నారు. అయితే పైన కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండటం, ఇటు రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ కు చెందిన కొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ చేశారు. ఇక ప్రధాన మోదీ, హోమ్ మంత్రి అమిత్ షాల సొంత రాష్ట్రం గుజరాత్ కావడంతో..బీజేపీ అధిష్టానం గుజరాత్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టింది.

కాంగ్రెస్ సైతం ఈ సారి బీజేపీకి చెక్ పెట్టాలని చెప్పి గట్టిగానే ట్రై చేస్తుంది. కాకపోతే కాంగ్రెస్ పార్టీకి బలం పెరిగినట్లు కనిపించడం లేదు. పైగా గుజరాత్‌లో ఆప్ బలం పెరుగుతూ వస్తుంది..ఆ పార్టీ దూకుడుగా ఉంది..ఇప్పటికే అభ్యర్ధులని ప్రకటించేసి ప్రచారంలో ముందు ఉంది. ఇలా ఆప్ పోరులోకి రావడంతో ట్రైయాంగిల్ ఫైట్ నడిచే అవకాశాలు ఉన్నాయి. అయితే కాంగ్రెస్, ఆప్‌ల మధ్య ఓట్లు చీలిపోయి, కాంగ్రెస్ పార్టీకే ప్లస్ అయ్యేలా ఉంది.

ఇటీవల వస్తున్న ఒపీనియన్ సర్వేల్లో కూడా బీజేపీకే ఎడ్జ్ కనిపిస్తోంది. ఆ పార్టీనే మళ్ళీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. వరుస ఓటముల వల్ల ఆ పార్టీకి సానుభూతి ఉంది. కానీ ఆప్ వల్ల, బీజేపీ ఎత్తులకు కాంగ్రెస్‌కు రిస్క్. చూడాలి మరి గుజరాత్ ఎవరికి దక్కుతుందో.

Read more RELATED
Recommended to you

Exit mobile version