టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత క్రీడాకారులు దుమ్ము రేపుతున్నారు. తాజాగా ఈ టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో భారత్ కు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇప్పటివరకు కాంస్య పతకం మరియు రజిత పతకాలే ఇండియాకు రాగా… తాజాగా గోల్డ్ పతకం ఇండియా ను వరించింది. వందేళ్ల తర్వాత తొలిసారిగా భారత్ కు స్వర్ణ పతకం వచ్చింది. ఒలంపిక్స్ జావెలిన్ త్రో లో భారత్ కు గోల్డ్ మెడల్ వచ్చింది.
జావెలిన్ త్రో లో 23 సంవత్సరాల భారత ప్లేయర్ నీరజ్ చోప్రా లో గోల్డ్ మెడల్ సాధించాడు. ఫైనల్ మొదటి రౌండులో 87.03 మీటర్ల దూరం జావెలిన్ విసిరి మొదటి స్థానానికి దూసుకు వెళ్ళాడు. అనంతరం జరిగిన పోటీల్లో 87.58 మీటర్లు విసిరి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకున్నాడు నీరజ్ చోప్రా. ఒలింపిక్స్ క్రీడల్లో గోల్డ్ మెడల్ సాధించి నీరజ్ చోప్రా చరిత్ర సృష్టించాడు. ఈ గోల్డ్ మెడల్ తో భారత్ పతకాల సంఖ్య ఏడుకు చేరుకుంది.