కరోనా మహమ్మారిని అరికట్టడానికి వ్యాక్సిన్ ఒక్కటే ఆయుధమని అందరికీ తెలుసు! అందుకే ఇప్పటికే సగానికి పైగా జనాభా వ్యాక్సిన్ తీసుకున్నారు. వాక్సిన్ తీసుకున్న వారు తమ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ ( Vaccine Certificate ) డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతో వారు విదేశీ ప్రయాణాల్లో కూడా ఉపయోగపడుతుంది.ఆ సర్టిఫికెట్ ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో తెలుసుకుందాం. కొవిన్ యాప్‌పై చాలా మందికి అంతగా తెలియదు.అందుకే ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో కూడా వాక్సిన్ సర్టిఫికెట్ డౌన్‌లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తోంది. ‘మై గవర్నన్‌మెంట్’కరోనా హెల్ప్‌డెస్క్ ఈ సరికొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు కేవలం వ్యాక్సిన్, టెస్టింగ్ కేంద్రాల వివరాలను మాత్రమే తెలియజేశాయి. ఇప్పుడు వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను నేరుగా వాట్సాప్‌లోనే పొందే అవకాశం కల్పిస్తోంది.
- వ్యాక్సిన్ సర్టిఫికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడానికి My gov కరోనా హెల్ప్‌డెస్క్ వాట్సాప్ నంబర్ +91 9013151515 ను సేవ్ చేసుకోండి.
- ఫోన్ నంబర్‌ను సేవ్ చేసిన తర్వాత వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేసి, చాట్ విండోలో ఈ కాంటాక్ట్ నంబర్‌ను సెర్చ్ చేసి ఓపెన్ చేయండి.
- ఆ తర్వాత డైలాగ్ బాక్స్‌లోని, డౌన్ లోడ్ సర్టిఫికెట్ అని టైప్ చేయండి. అప్పుడు మీ వాట్సాప్ నంబర్ ఇది వరకే కొవిన్ ప్లాట్‌ఫామ్‌లో నమోదై ఉంటే మీకు ఓటీపీ వస్తుంది.
- ఓటీపీని వాట్సాప్ చాట్‌లో ఎంటర్ చేసి, చాట్‌బాట్ వెంటనే మీ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను మీ వాట్సాప్ నంబర్‌కు పంపిస్తుంది. దాన్ని డౌన్ లోడ్ చేసుకోండి.