బిగ్‌బాస్ ఫైన‌ల్స్: నాగ్ ట్వీట్ వెన‌క సందేహాలు… కుట్ర జ‌రుగుతోందా…!

-

తెలుగు బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్‌3 చివరి అంకానికి చేరుకుంది. మరి కొద్ది గంటల్లో గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆదివారం సాయంత్రం 6 గంట‌ల నుంచి స్టార్ మా ఛానెల్లో ఫైన‌ల్ స్టార్ట్ కానుంది. రాత్రి 10 గంట‌ల‌కు బిగ్‌బాస్ విన్న‌ర్ ఎవ‌రో తేలిపోనుంది. మొత్తం 105 రోజులుగా తెలుగు ప్రేక్ష‌కుల‌కు మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇస్తోన్న ఈ షోలో ఫైన‌ల్స్‌కు చేరుకున్న వేళ సోష‌ల్ మీడియాలో విన్న‌ర్ ఎవ‌రు ? అనే అంశంపై ర‌క‌ర‌కాల చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి.

బ‌య‌ట జ‌రుగుతోన్న పోలింగ్‌తో పాటు సోష‌ల్ మీడియా ట్రెండ్స్‌ను బ‌ట్టి చూస్తే శ్రీముఖి కంటే సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌కే ఎక్కువ ఓట్లు రావ‌డంతో రాహుల్ బిగ్‌బాస్ 3 సీజ‌న్ విన్న‌ర్ అన్న టాక్ బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌తి ఎలిమినేష‌న్ విష‌యంలో లీకు వీరులు చెప్పిందే నిజం కావ‌డంతో ఇప్పుడు లీక్ అయిన మ్యాట‌ర్‌ను బ‌ట్టి చూస్తే రాహుల్ విన్న‌ర్ అన్న‌ది నిజం కావాలి. ఇక చిచ్చా రాహుల్ అభిమానులు కూడా సంబ‌రాలు చేసుకుంటున్నారు.

అయితే బిగ్‌బాస్ నిర్వాహ‌కులు, డైరెక్ట‌ర్లు మాత్రం ముందు నుంచి శ్రీముఖికి అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌న్న ఆరోప‌ణ‌లు ఉన్నాయి. బ‌య‌ట‌కు వ‌చ్చిన కంటెస్టెంట్లు కూడా ఇదే సందేహం వ్య‌క్తం చేశారు. అయితే నాగ్ ఓ సారి పాత వీడియోలు ప్లే చేసి శ్రీముఖికి బిగ్‌బాస్ అనుకూలం అంటూ వ‌చ్చిన వార్త‌ల‌కు క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశాడు. ఇక ఈ రోజు బిగ్‌బాస్ ఫైన‌ల్ కొద్ది గంటల్లో ప్రారంభం కానున్న వేళ నాగ్ మ‌ళ్లీ త‌న సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు.

బిగ్‌బాస్ టైటిల్ విన్న‌ర్‌పై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలన్నీ ఫేక్‌ అంటూ కొట్టిపారేశారు నాగార్జున. అసలు టైటిల్ విన్నర్‌ ఎవరో తాను చెప్తానని.. అది కూడా బిగ్ బాస్ లైవ్ స్ట్రీమింగ్ అంటూ సంచలనం రేపాడు. నాగ్ ఈ విష‌యంలో ఇప్ప‌టికిప్పుడు క్లారిటీ ఇవ్వాల్సిన అవ‌స‌రం లేదు. బ‌య‌ట ఏం జ‌రిగినా ఇప్ప‌టి వ‌ర‌కు ఎలిమినేష‌న్ విష‌యంలో కూడా స్పందించ‌ని నాగ్ ఇప్పుడే ఎందుకు స్పందించాడు ? అన్న సందేహాలు వ‌స్తున్నాయి. ఇప్పుడు బ‌య‌ట అంతా రాహుల్ పేరు ట్రెండ్ అవుతోంది… చివ‌ర్లో బిగ్‌బాస్ నిర్వాహ‌కులు ఏదైనా కుట్ర చేసి శ్రీముఖిని గెలిపించారా ? షోలో రాహుల్‌కు యాంటీగా ఏదైనా కుట్ర జ‌రిగిందా ? అన్న డౌట్లు వ‌స్తున్నాయి. మ‌రి ఫైన‌ల్‌గా ఏం జ‌రిగిందో ? చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version