Bigg Boss Telugu 3 Episode 22: తమన్నా ఔట్.. అలరించిన స్పెషల్ గెస్ట్..!

-

22 వ ఎపిసోడ్ కాస్త ఫన్ డే గానే జరిగింది. యాజ్ యూజువల్ గా నాగార్జున షోను అద్భుతంగా నడిపించారు. సన్ డే ను ఫన్ డే చేశారు. షో ప్రారంభం కాగానే అంకితం నీకే అంకితం అంటూ ఓ ఫన్ గేమ్ ను ఇంటి సభ్యులతో నాగ్ ఆడించారు.

అనుకున్నదే జరిగింది. చాలామంది ఈసారి తమన్నా ఎలిమినేట్ అయిపోతుందనుకున్నారు. అలాగే జరిగింది. అందులోనూ తను గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఉన్న రెండు వారాల్లో హౌస్ లో ఎన్నో గొడవలు. కావాలని కొందరు హౌస్ మేట్స్ తో గొడవ పెట్టుకొని వాళ్లను వ్యక్తిగతంగా విమర్శించింది తమన్నా. నాకు ఈ ఇంట్లో ఉండాలని లేదని తమన్నాయే కోరుకున్నది. అనుకున్నట్టుగానే ప్రేక్షకులకు కూడా తమన్నాపై చిరాకు వచ్చేసింది. అందుకే.. ఆమెను ఎలిమినేట్ చేసేశారు.

22 వ ఎపిసోడ్ కాస్త ఫన్ డే గానే జరిగింది. యాజ్ యూజువల్ గా నాగార్జున షోను అద్భుతంగా నడిపించారు. సన్ డే ను ఫన్ డే చేశారు. షో ప్రారంభం కాగానే అంకితం నీకే అంకితం అంటూ ఓ ఫన్ గేమ్ ను ఇంటి సభ్యులతో నాగ్ ఆడించారు. ఆ గేమ్ ఆడుతుండగానే నామినేషన్ లో ఉన్న ఒక్కో హౌస్ మేట్ ను బిగ్ బాస్ సేవ్ చేస్తూ వచ్చారు.

ముందుగా రాహుల్ సేఫ్ అని చెప్పారు నాగ్. ఆ తర్వాత పునర్నవి సేఫ్ అయింది. ఆ తర్వాత బాబా భాస్కర్ సేఫ్ అయ్యారు. ఇక మిగిలింది తమన్నా, వితిక మాత్రమే. వీళ్లిద్దరిలో టెన్షన్ మరింత ఎక్కువైంది. ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారా? అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు.

షో మధ్యలో స్పెషల్ గెస్ట్ గా వెన్నెల కిషోర్ వచ్చి కాసేపు హౌస్ మేట్స్ తో సరదాగా గడిపారు. అందరి గురించి ఫన్ గా చెప్పారు. హౌస్ మేట్స్ కు నాగ్, వెన్నెల కిషోర్ నటించిన మన్మథుడు 2 సినిమా ట్రైలర్ ను చూపించారు. వెన్నెల కిషోర్ అందరికీ బైబై చెప్పి వెళ్లిపోయాక… తమన్నా ఎలిమినేట్ అయిపోయింది.. బ్యాగ్ సర్దుకొని స్టేజీ మీదికి వచ్చేయాలంటూ నాగ్ చెబుతారు.

వెంటనే తమన్నా అందరికీ హగ్స్ ఇచ్చి.. సెల్ఫీ దిగి బిగ్ బాస్ ఇంట్లో నుంచి వెళ్లిపోతుంది. స్టేజీ మీదికి వచ్చాక.. ఇంట్లో ఉన్న మిగితా కుటుంబ సభ్యుల్లో ఎవరు ఎటువంటి వాళ్లో చెప్పాలంటూ నాగ్ ఆమెను కోరుతారు. దీంతో అందరి గురించి తమన్నా తన మనసులోని మాటను చెప్పేస్తుంది. తర్వాత నాగ్ కూడా తమన్నాతో సెల్ఫీ తీసుకొని ఇంటి నుంచి పంపించేస్తారు. అలా సన్ డే కాస్త ఫన్ డేగా గడిచింది.

Read more RELATED
Recommended to you

Latest news