Episode 6 Review: వితిక, వరుణ్ కు క్షమాపణలు చెప్పిన మహేశ్ విట్టా..!

-

ఇప్పటికే ఓటింగ్ లైన్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఓటేయాలనుకునే వాళ్లు తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓటేయొచ్చు.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 3.. అప్పుడే ఆరు ఎపిసోడ్ లను పూర్తి చేసుకుంది. శుక్రవారంతో ఆరో ఎపిసోడ్ పూర్తయింది. ఇవాళ ఏడో ఎపిసోడ్.. అంతే కాదు.. ఎలిమినేషన్ రౌండ్ కూడా ఈరోజే ఉండే అవకాశం ఉంది. అంతే కాదు.. హోస్ట్ నాగార్జున కూడా ఈరోజు స్టేజీ మీదికి వచ్చి… ఈ వారం రోజులు ఇంటి సభ్యులు ఎలా గడిపారో తెలుసుకునే అవకాశం ఉంది. దానితో పాటు హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన వాళ్లలో ఎవరో ఒకరు ఈ వారం వెళ్లిపోనున్నారు.

bigg boss telugu season 3 episode 6 review

ఇప్పటికే ఓటింగ్ లైన్స్ కూడా ప్రారంభం అయ్యాయి. ఓటేయాలనుకునే వాళ్లు తమకు నచ్చిన కంటెస్టెంట్లకు ఓటేయొచ్చు.

ఇక.. ఆరో ఎపిసోడ్ లో అంటే హౌస్ లో ఐదో రోజు ఎపిసోడ్ హైలెట్ అంటే మహేశ్ విట్టా అనే చెప్పుకోవాలి. వితిక, వరుణ్ తో మహేశ్ గొడవపడిన సంగతి తెలిసిందే కదా. ఆ గొడవ కాస్త పెరిగి పెద్దదయింది. వరుణ్ ఏకంగా మహేశ్ ను కొట్టబోయాడు. కానీ.. చివరకు మహేశే వచ్చి వితిక, మహేశ్ కు క్షమాపణలు చెప్పాడు. ఆ తర్వాత అంతా సద్దుమణిగింది. రాత్రి అందరూ నిద్రపోయారు.

bigg boss telugu season 3 episode 6 review

తెల్లారి లేచాక… అంతా సరదాగా గడిచిపోయింది. ఐదో రోజు వంట అంతా బాబా భాస్కర్, శ్రీముఖి చేశారు. అయితే.. ఫుడ్ దగ్గర శ్రీముఖి, రాహుల్ మధ్య చిన్న గొడవ వచ్చింది.

ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటి సభ్యులందరికీ ఓ టాస్క్ ఇచ్చాడు. కళాకారులం.. మేం కళాకారులం అనే కాన్సెప్ట్ ఇచ్చాడు. సభ్యులందరినీ రెండు టీములుగా విడగొట్టాడు. రెండు టీమ్స్ కలిసి తమకు నచ్చిన స్కిట్ చేయాలి. రెండు స్కిట్స్ లో ఏ స్కిట్ బాగుందో బిగ్ బాస్ తెలియజేస్తాడు.

ఒకటి శ్రీముఖి స్కూల్.. రెండోది బాబా భాస్కర్ స్కూల్. శ్రీముఖి స్కూల్ లో ఉన్న సభ్యులు వరుణ్, వితిక, రవికృష్ణ, రోహిణి, పునర్నవి, అషు కాగా… బాబా భాస్కర్ స్కూల్ లో అలీ రాజా, మహేశ్ విట్టా, రాహుల్, శివజ్యోతి, జాఫర్, హిమజ సభ్యులుగా ఉన్నారు.

శ్రీముఖి స్కూల్ వాళ్లు… దెయ్యం ఉండే ప్రాంతంలోకి వెళ్లి అక్కడ చిక్కుకొని.. టూరిస్ట్ గైడ్ చేతిలో మోసపోయి ప్రాణాలు కోల్పోయే వాళ్లుగా స్కిట్ చేసి అలరించారు.

బాబా భాస్కర్ వాళ్లు.. రైతు, పల్లెటూరు నేపథ్యంలో స్కిట్ చేశారు. రైతుగా నటించి మహేశ్ విట్టా అదరగొట్టాడు. రెండు స్కిట్స్ అయిపోగానే ఈరోజు ఎపిసోడ్ పూర్తయింది.

చూద్దాం.. ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉంటుందో? ఈరోజే ఒకరు ఎలిమినేట్ అవుతారా? లేక.. రేపు ఎలిమినేట్ అవుతారా? అనేది మాత్రం సస్పెన్స్ గానే ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news