నాకు గిట్టుబాటు కాలేదు.. అందుకే నొక్కేశా.. అసెంబ్లీ సాక్షిగా వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

-

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి.. సీఎం జగన్ కోసం తలలు తీసి యజ్ఞ‌గుండంలో వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. జగన్ కోసం 60 మంది ఎమ్మెల్యేలందరం ఒక దళంగా ఉన్నామని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేశారు శివప్రసాద్ రెడ్డి.

ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే కదా. సాధారణంగా ప్రతిపక్ష సభ్యులు సభలో గందరగోళం సృష్టిస్తారు. అదీ ఇదీ మాట్లాడుతారు. అధికార పక్షంపై దుమ్మెత్తి పోస్తారు. కానీ.. ఏపీ అసెంబ్లీలో గత రెండు రోజుల నుంచి విచిత్రం జరుగుతోంది.

ycp mla karanam dharmasri sensational comments in assembly

ప్రొద్దుటూరు ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి.. సీఎం జగన్ కోసం తలలు తీసి యజ్ఞ‌గుండంలో వేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. జగన్ కోసం 60 మంది ఎమ్మెల్యేలందరం ఒక దళంగా ఉన్నామని చెప్పి షాకింగ్ కామెంట్స్ చేశారు శివప్రసాద్ రెడ్డి.

తాజాగా.. మరో వైసీపీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కౌలు రైతులకు రావాల్సినవన్నీ తానే నొక్కేసేవాడినని షాకింగ్ కామెంట్లు చేశారు. 2019 మార్కెటింగ్ బిల్లుపై ప్రసంగించిన ధర్మశ్రీ.. నేను ఒక రైతును. నాకు 25 ఎకరాల వ్యవసాయం ఉంది. అందులో 5 ఎకరాలు నేనే పండిస్తా. మిగితా 20 ఎకరాలు నలుగురు కౌలు రైతులకు ఇచ్చా. వాళ్లు పండించుకుంటారు. కాకపోతే కౌలు రైతులకు చెందాల్సిన ప్రయోజనాలన్నీ నేనే తీసుకుంటా. వాళ్లకు ఏదీ ఇవ్వను. టీడీపీ ప్రభుత్వ హయాంలో నేను అదే చేసేవాడిని. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన ఇన్ పుట్ సబ్సిడీ, పంట బీమా, పంట నష్టం.. ఇలా అన్నీ కౌలు రైతులకు చెందకుండా నేనే నొక్కేసేవాడిని. ఎందుకంటే.. పంట గిట్టుబాటు కావట్లేదు. నాకు గిట్టుబాటు కాకపోవడం వల్ల కౌలు రైతులకు చెందాల్సినవి నొక్కేసినప్పటికీ… కౌలు రైతు తను పండించిన దాంట్లో ఎంతో కొంత నాకు ఇచ్చినప్పటికీ నేను తీసుకునే వాడిని. లేకపోతే వాళ్లు ఓటు కూడా వేయరు కదా. గత ప్రభుత్వం కౌలు రైతుల కోసం అది చేసింది.. ఇది చేసింది.. అన్ని గప్పాలు కొట్టినప్పటికీ.. క్షేత్రస్థాయిలో కౌలు రైతుకు ఆ పరిహారం అందలేదు. కానీ.. ఇకనుంచి అలా జరగదు. కౌలు రైతులకు నష్టం జరగదు. అందుకే మార్కెటింగ్ బిల్లు తీసుకొచ్చాం. ఈ బిల్లు ద్వారా కౌలు రైతులకు ఎంతో మంచి జరుగుతుంది.. అని ఎమ్మెల్యే వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news