బిగ్‌బాస్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇలానా… చొక్కా విప్పేసి వీర హంగామా…

-

బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టంట్‌గా ఉన్న అలీ రెజా ఆరోవారంలో ఎలిమినేషన్ అయిపోయిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా అలీ ఎలిమినేట్ కావడంతో ఇంటి సభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు. ఇక అలీ సిస్టర్ గా గట్టి బంధం ఏర్పరచుకున్న శివజ్యోతి అయితే బోరున ఏడ్చింది. అయితే అలీ ఎలిమినేట్ అవ్వడం ప్రేక్షకులకు కూడా నచ్చలేదు. అలీ మళ్ళీ హౌస్ లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా అభిమానులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే అందరికి సడన్ సర్ప్రైజ్ ఇస్తూ..బిగ్ బాస్ హౌస్ లోకి అలీ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు.

 

మొదట ఇంటి సభ్యులకు టీవీ ద్వారా అలీ మాస్క్ వేసుకుని డ్యాన్స్ చేస్తున్న వీడియోని చూపించారు. అది చూసిన ఇంటి సభ్యులు అలీనే వస్తున్నాడని కనిపెట్టేశారు. ఇదే సమయంలో మొదట గార్డెన్ ఏరియాలోకి రష్యన్ డ్యాన్సర్లు డ్యాన్స్ వేసుకుంటూ వచ్చారు. ఇక వారిని చూసి కంటెస్టంట్స్ వారితో కలిసి డ్యాన్స్ వేశారు. ఇలా డ్యాన్స్ వేస్తున్న సమయంలో అలీ మాస్క్‌తో హౌస్ లోకి వచ్చాడు. అలీ రాకతో శ్రీముఖి ఎగిరి గంతులు వేస్తూ..తనని హత్తుకుపోయింది. ఆలీ ఎంట్రీకి ముందు వీర లెవెల్ లో హడావుడి సృష్టించాడు. చొక్కా విప్పి రొమ్ము విరుచుకుంటూ.. అలీ రెజా హౌస్ లోకి వచ్చాడు.

అలీ అక్క.. శివజ్యోతి ఎప్పటిలాగే ట్యాప్ ఓపెన్ చేసేసింది. గుక్కపెట్టి మిస్ యు అలీ అంటూ బోరు బోరున ఏడ్చింది. ఊకో అక్కా అని అలీ ఎత్తుకుని బుజ్జగించినా కన్నీటి వరద మాత్రం ఆగలేదు. ‘అక్కా.. నేను ఎలిమినేట్ అయ్యా.. చనిపోలేదు’ అంటూ మనపై బయట మీమ్స్ వస్తున్నాయని చెప్పి అలీ శివజ్యోతిని అలిగేలా చేశాడు. ఇక అలిగిన జ్యోతిని రవి బుజ్జగించాడు. మొత్తానికి అలీ రీ ఎంట్రీతో ఇంటి సభ్యులందరూ సంతోషంగా ఫీల్ అయ్యారు. అటు ఈ వారం కెప్టెన్ టాస్క్ లో రవి, శ్రీముఖి, శివజ్యోతి, బాబా భాస్కర్ లు పోటీ పడనున్నారు. శుక్రవారం ఎపిసోడ్ లో టాస్క్ జరగనుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version