BiGG BOSS -5 : సరయు ఎలిమినేట్ అయ్యిందా..?

బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ల ప్రక్రియ సోమవారం మొదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ వారం ఎలిమినేషన్ లోకి యాంకర్ రవి, సరయు, జెస్సీ, హమిదా,ఆర్ జే కాజల్, మానస్ వచ్చారు. అయితే నిన్న శనివారం ఎపిసోడ్ లో యాంకర్ రవి, మానస్, ఆర్ జే కాజల్ సేఫ్ జోన్ లోకి వెళ్ళారు. అయితే మొదటి వారం బిగ్ బాస్ హౌజ్ నుండి సరయు ఎలిమినేట్ అయ్యిందని జోరుగా ప్రచారం జరుగుతోంది.

నిన్న షూటింగ్ పూర్తి కాగా సరయు హౌస్ నుండి బయటకు వచ్చిందని వార్తలు వస్తున్నాయి. ముందు రోజు కూడా సరయు కు తక్కువ ఓట్లు వచ్చయంటూ వార్తలు వచ్చాయి. ఇక సరయు ఎలిమినేషన్ వార్తలు రావడం తో ఆమె అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మరో వైపు బిగ్ బస్ లో సరయు స్ట్రాంగ్ సభ్యురాలు కావడం తో షాక్ అవుతున్నారు. మరోవైపు సరయు ను హౌస్ నుండి సీక్రెట్ రూం కు పంపించారని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈరోజు ఎపిసోడ్ వచ్చే వరకు వేచి చూడాల్సిందే.