తెలుగు యాంకర్లలో శ్రీముఖికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఒక్క క్షణం కూడా తీరిక లేని షూటింగ్‌లతో వద్దంటే వచ్చే లక్షల డబ్బులతో బుల్లితెరను ఆమె ఓ రేంజ్‌లో ఆటాడిస్తోంది. ఆమెకు వేలాదిగా ఉన్న అభిమానుల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు హీరోయిన్‌గా కూడా రాణిస్తోంది. అటు వెండితెర మీద కూడా తన అదృష్టం పరిక్షించుకుంటోంది. ఎన్నో కార్యక్రమాలకు యాంకర్‌గా ఉన్న ఆమె ఇవన్నీ వద్దనుకుని బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
శ్రీముఖికి కావాల్సింది డబ్బు కాదు. అప్పటికే ఉన్న ఇమేజ్ డబుల్, ట్రిబుల్ అవ్వాలంటే అందుకు బిగ్‌బాస్ ప్రోగ్రామ్ ఒక్కటే మార్గం అని ఆమె భావించింది. అయితే సీన్ రివర్స్ అయ్యింది. బిగ్‌బాస్‌లో ఆమె ఆశలు అన్నీ రివర్స్ అయ్యాయి. అందరూ అనుకున్నట్టే ఆమె ఫైనల్స్‌కు వెళ్లింది. కానీ ఫైనల్స్‌లో రాహుల్ సిప్లిగంజ్ చేతిలో ఆమె ఓడి రన్నరఫ్‌తో సరిపెట్టుకుంది.
ముఖ్యంగా హౌస్‌లో ఆమె ఎవరితో అయితే ముందు నుంచి గొడవ పడుతూ వచ్చిందో చివరకు అదే రాహుల్ ఆమెను ఓడించడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయింది. ఓటమి తర్వాత ఆమె అదే వేదిక మీద మాట్లాడుతూ ఓటమిని తాను జీర్ణించుకోలేకపోతున్నట్టు కూడా చెప్పింది. ఇక హౌస్ నుంచి నవ్వుతూ బయటకు వచ్చిన శ్రీముఖి ఇంటికెళ్లాక ఒక్కటే ఏడుపు అట.
కేవలం గెలుపు కోసమే హౌస్‌లోకి వెళ్లిన శ్రీముఖిని స్టార్ మా నిర్వాహకులు సరిగా పట్టించుకోలేదట. ఎవరైతే తనకు వ్యక్తిగతంగా హామీ ఇచ్చారో వాళ్లంతా హ్యాండ్ ఇచ్చారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఇక టైటిల్ వచ్చేలా చేస్తామని చెప్పిన నిర్వాహకులు.. ఆమెకు రోజువారీ ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా తగ్గించారట. దీంతో వాళ్లు తనను నమ్మించి మోసం చేశారని ఆమె సన్నిహితుల వద్ద వాపోతోందట. అలా రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది శ్రీముఖి పరిస్థితి.