Budget Update: కేంద్ర బడ్జెట్ గురించి తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన 8 విషయాలు..!

-

కేంద్ర బడ్జెట్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీ కోసం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఫిబ్రవరి 1న 2024 -25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మధ్యంతర బడ్జెట్ ని పార్లమెంట్ లోకి ప్రవేశపెట్టబోతున్నారు కేంద్ర బడ్జెట్ కి సంబంధించి ఎనిమిది ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం.

ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా

2016 దాకా ఫిబ్రవరి చివరి వర్కింగ్ డే నాడు పార్లమెంటులో ఈ బడ్జెట్ ని సమర్పించేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఫిబ్రవరి 1వ తేదీ నాడే ప్రవేశపెడుతున్నారు.

1999 దాకా కేంద్ర బడ్జెట్‌ను సాయంత్రం 5:00 గంటలకు తీసుకు వచ్చేవారట. కానీ మాజీ ఆర్థిక మంత్రి యశ్వంత్ సిన్హా 2001 నుంచి ఉదయం 11:00 గంటలకు మార్చడం జరిగింది.

ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే బడ్జెట్‌ సమర్పించడానికి వారం ముందు హల్వా వేడుక జరుగుతుంది. ఆరోజున ఆర్థిక మంత్రి, మంత్రిత్వ శాఖ అధికారులు సిబ్బందికి హల్వా ని పంచడం జరుగుతుంది.

2021 ఫిబ్రవరి 1న నిర్మలా సీతారామన్ డిజిటల్ టాబ్లెట్‌ను ఉపయోగించి మొదటి పేపర్‌లెస్ బడ్జెట్‌ను తీసుకొచ్చారు.

ఆర్‌కే షణ్ముఖం చెట్టి లానే 2018 వరకు ఆర్థిక మంత్రులు లెదర్ బ్రీఫ్‌కేస్‌ లో బడ్జెట్ ను తీసుకు వెళ్లేవారు. ఇప్పుడేమి అలా లేదు.

యూనియన్ బడ్జెట్‌లో రెండు పార్ట్స్ ఉంటాయి. వార్షిక ఆర్థిక ప్రకటన, గ్రాంట్ల డిమాండ్. గ్రాంట్‌ల డిమాండ్‌లో అంచనా వ్యయం ఉంటుంది. వార్షిక ఆర్థిక ప్రకటన రాబోయే సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయ సారాంశాన్ని ఇస్తుంది.

ఆర్థిక మంత్రి ప్రసంగంలో కేంద్ర బడ్జెట్‌ను సబ్మిట్ చేస్తారు. తర్వాత లోక్‌సభలో చర్చలు జరిపి ఓటింగ్ ఉంటుంది. అదనంగా ప్రభుత్వ ఆర్థిక పనితీరుపై మధ్య-సంవత్సర సమీక్ష, అర్ధ-వార్షిక నివేదిక కూడా ఇస్తారు.

కేంద్ర బడ్జెట్‌ను సమర్పించే ముందు ఆమోదం కోసం ఆర్థిక మంత్రి రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతిని కలిసి ఆ తరవాతే సబ్మిట్ చేస్తారు.

 

Read more RELATED
Recommended to you

Latest news