కాపులు అందరూ కాంగ్రెస్ లోకి రావాలి : చింతా మోహన్

-

ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు అప్పుడే హీట్ పుట్టిస్తున్నాయి. అన్ని పార్టీలు విజయమే లక్ష్యంగా తమ వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి. రాష్ట్ర విభజన తరువాత ఏపీలో కనుమరుగైన కాంగ్రెస్ మళ్లీ పూర్వ వైభవం కోసం ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ షర్మిలకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్ష పదవీ కట్టబెట్టింది. ఇతర పార్టీల నేతలతో పార్టీలోకి ఆహ్వానించే పనిలో పడిపోయారు కాంగ్రెస్ నేతలు.

ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి పొలిటికల్ రీ ఎంట్రీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఇవాళ రాజమండ్రిలో మాట్లాడారు. కాపులను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నామని కాపులందరూ కాంగ్రెస్ లోకి రావాలని పిలుపునిచ్చారు. అంతేకాదు..చిరంజీవి కూడా కాంగ్రెస్ లోకి రావాలని.. ఆయనను అసెంబ్లీలో చూడాలని ఉందన్నారు. చిరంజీవిని తిరుపతి నుంచి పోటీ చేయాలని కోరుతున్నామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news