ఝాన్సీ కీ రాణీ.. స్వాతంత్ర్య సమర యోధురాలు ఝాన్సీ లక్ష్మి భాయి…!

-

మన దేశానికి వ్యాపారం పేరు తో వచ్చి ఆంగ్లేయులు దేశం మొత్తం ఆక్రమించుకుని భారతీయులందరినీ బానిసలుగా మార్చారు. దీనితో అప్పటి పరిపాలనలో ఉన్నబలవంతులైన రాజులు తిరుగుబాటు చేసారు. అయితే బ్రిటిష్ వారు వారందరినీ అనగ తొక్కారు. ఉత్తర భారతదేశ రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి లక్ష్మి భాయి. ఆమె 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలోని బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీ కి రాణి గ ప్రసిద్ధికెక్కినది.1857 లో భారత దేశ తిరుగుబాటు దార్లలో ముఖ్యమైన వాళ్ళలో ఈమె ఒకరు.

ఝాన్సీ లక్ష్మీబాయి’ అసలు పేరు మణికర్ణిక. ఆమె 1828వ సంవత్సరము నవంబరు నెల19 న మహారాష్ట్ర కు చెందిన బ్రాహ్మణుల కుటుంబంలో జన్మించింది. లక్ష్మీబాయికి 13 ఏళ్ళ వయసులోనే 1842లో ఝాన్సీ పట్టణానికి రాజైన గంగాధరరావు నెవల్కార్ తో వివాహమైంది. 1851లో లక్ష్మీబాయికి ఒక కుమారుడు జన్మించాడు. అయితే ఆ పిల్లవాడు నాలుగు నెలల వయసులోనే కన్నుమూశాడు. 1853 లో గంగాధర రావుకు విపరీతమైన అనారోగ్యం సోకింది. 1853, నవంబర్ 21 వ తేదీన గంగాధరరావు మరణించాడు.

గంగాధర రావు కి పిల్లలు లేనందున రాజ్యాన్ని స్వాధీన పరచి ఝాన్సి నుంచి రాణి ని వెళ్లాలని ఆదేశించారు. కాని దానికి ఆమె ఒప్పుకోలేదు. ఆమె తనకున్న యుద్ద విద్యల మీద పట్టు తో సైన్యాన్ని సిద్దం చేసింది. ఆ సైన్యంలోకి మహిళలు కూడా తమకు తాము గా వచ్చి చేరారు. ఆమె కున్న ధైర్యము, పరాక్రమము, వివేకము, భారతదేశంలో 19 వ శతాబ్దములో మహిళలకున్న అధికారం పై ఆమెకున్న ముందు చూపు, ఆమె చేసిన త్యాగాలు ఆమెని స్వాతంత్ర్య పోరాటంలో ఒక ప్రసిద్ధ వ్యక్తిగా నిలిపింది.

ఆమె రెండవ ప్రపంచ యుద్ద సమయంలో కన్ను మూసింది. ఝాన్సీ, గ్వాలియర్ లలో ఆమె గుర్తుగా కంచు విగ్రహాలను స్థాపించారు, రెండింటి లోను ఆమె గుర్రం పైన కూర్చున్నట్టుగా చిత్రీకరించారు. గ్వాలియర్ యుద్ధం గురించి జనరల్ రోస్ ప్రస్తావిస్తూ విప్లవ కారుల్లోకెల్లా ఆమే అత్యంత ధైర్య సాహసాలతో పోరు సల్పిందని కితాబిచ్చాడు. దాని వల్లనే ఆమె భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడమే కాక 19వ శతాబ్దంలో మహిళా సాధికారతకు ఆదర్శ ప్రాయంగా నిలిచింది.

Read more RELATED
Recommended to you

Latest news