కలాం సేవలు అమోఘం..డిఫెన్స్‌ రీసర్చ్‌ అండ్‌ డెవలప్మెంట్‌లో ఎనలేని ప్రతిభ…

-

అవుల్‌ పకీర్‌ జైనులాబిద్దీన్‌ అబ్ధుల్‌ కలాం..ఈ మహనీయుడికి ఏ బిరుదైన తక్కువే. అంతటి గొప్ప వ్యక్తి ఆయన. చీకటిలో మగ్గిపోతున్న జీవితాలకు ఆశాజ్యోతి ఏపీజే అబ్దుల్‌ కలాం చెప్పిన మాటలు. నిరాశ నిండిన మనసుకు ఆ మాటలే స్పూర్తి. తెలియని ధైర్యం, ఏదైనా సాధించాలనే తపన కలాం మాటలు విన్న ప్రతి వ్యక్తికి కలుగుతుంది. ఆయన ఉపన్యాసాల్లో యువత నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. విద్యార్థులంటే కలాంకు అమితమైన ప్రేమ. అపరజ్ఞానులు, పండితులు, కర్మాచరణ తత్పరులు – వీరందరికంటే ‘కర్మయోగి’ గొప్పవాడు అని శ్రీకృష్ణ పరమాత్మ అనేవాడు..ఈ పదం కలాంలో కూడా బాగా సరిపోతుంది. కలాం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈరోజు మీకోసం..!
అవుల్ పకీర్ జైనులాబిద్దీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబరు 15న ఒక తమిళ ముస్లిం పరివారంలో జన్మించారు.. ఆయన తండ్రి జైనులాబిద్దీన్ ఒక నావికుడు. రామేశ్వరం నుంచి సాంబమ్ ద్వీపం వరకు తీర్థయాత్రికులను చేరవేయడం ఆయన వృత్తి. వీరు మొదట్లో సంపన్నులే..భూములు కూడా ఉండేవి. కానీ కాలం కలిసిరాక కలాం చిన్ననాటికి వారి కుటుంబం బీదరికం అనుభివించాల్సి వచ్చింది. తండ్రికి కొంత ఆర్ధిక సహాయం చేయాలన్న తలంపుతో ఇంటింటికి న్యూస్ పేపర్లు పంచేవాడు కలాం. రామేశ్వరం స్కూల్లో హైస్కూలు చదువు పూర్తిచేశారు.
ఆ తరువాత చదువుకోసం తిరుచారపల్లి వెళ్ళీ సెంటిజోసఫ్ కాలేజీలో చేరారు.. మద్రాసు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఫిజిక్స్, ఎయిర్ స్పేస్ విషయాలతో పోస్టుగ్రాడ్యుయేషన్ చేశాడు. ఒక సారి ప్రాజెక్టు నిర్ణీత సమయంలో చేయనందుకు డీన్ మండిపడ్డారు. మూడురోజుల్లో పూర్తిచేసి చూపించకపోతే నీకు ఉద్వాసన ఖాయం అని హెచ్చరించాడు. కలాం ఆ నిర్ణీత సమయంలో పూర్తిచేసి చూపించగా “నిన్ను అనవసరంగా బాధపెట్టాను. అయితే ఒకటి గుర్తుంచుకో. ఏ పనినైనా సమయ సీమలో చేయాలన్న విషయం జీవితాంతం గుర్తుంచుకో” అని డీన్‌ అన్నాడు..
కలాంకు భారతీయ వాయుసేనలో పైలట్‌గా ఉద్యోగం చేయాలని చాలా తపన ఉండేది. కానీ ఆ అవకాశం వచ్చినట్టే వచ్చి పోయింది. కలాంకు తొమ్మిదవ ర్యాంకు వచ్చింది. ఉన్నవి ఎనిమిదే పోస్టులు. బెత్తెడు దూరంలో అవకాశం చేజారిపోయింది. కలాంకు మరో రంగంలో ఉన్నత శిఖరాలను అధిగమించవలసి ఉంది కాబట్టే, ఆ తరువాత నాలుగు దశాబ్దాలపాటు ఆయన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలపమెంట్ (డిఆర్డిఓ)లోను, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో)లలో పనిచేశారు..సాగరిక అంతరిక్ష ప్రోగ్రాములోను మిలిటరీ మిసైల్ డెవలప్మెంట్ లోను పనిచేశారు.. అతను ‘మిసైలమేన్’గా ఖ్యాతిగాంచాడు. పోఖ్రణ్ అణువిస్ఫోటనం ఆయన పనిచేసిన సమయంలోనే జరిగింది.
చిన్న హోవర్ క్రాఫ్ట్తో అతని పని మొదలైంది. ప్రసిద్ధ అంతరిక్ష విజ్ఞానవేత్త విక్రమ్ సారాభాయి వద్ద పనిచేసే సువర్ణావకాశం లభించింది. ఇస్రోకు ఆయనను బదిలీ చేశారు. ఒక ప్రాజక్టుకి డైరెక్టరుగా కూడా పనిచేశాడు. ఆయన పర్యవేక్షణలో ఎసి, ఎల్.వి-3 రాకెట్ ప్రయోగం విజయవంతమై అంతరిక్షంలోనికి దూసుకుపోయింది. 1980లో రోహిణీ రాకెట్‌ను భూమి కక్షకు దగ్గరగా పంపారు. ఈ ప్రాజక్టును మరింత విస్తారం చేయమని ప్రభుత్వం ఆదేశించింది. రాజా రామన్న భారతి మొదటి న్యూక్లియర్ టెస్ట్ నవ్వుతున్న బుద్ధాను చూడడానికి రమ్మనీ కలాంను ఆహ్వానించారు.. అప్పటికి కలాం టిబిఆర్ఎల్ ప్రతినిధి మాత్రమే. 1970లలో ఆయన ఆ ప్రాజెక్టుతో పనిచేయలేదు. కలాం కూడా ప్రాజక్టు డెవిల్, ప్రాజక్టు విలియంట్లను నిర్దేశించారు. బాలిస్టిక్, మిసైలుల నిర్మాణానికి ప్రభుత్వాన్ని అనుమతి కోరగా ప్రభుత్వం నిరాకరించింది. కాని అప్పటి ప్రధాని అనుమతినిస్తూ తన శక్తులను ఉపయోగించి రహస్యంగా ధనం ఇచ్చారు. ఆనాటి రక్షణ మంత్రి కలుగజేసుకొని ‘మణిరం’ మిస్సైల్స్ నిర్మాణాన్ని ప్రోత్సహించారు. ఆ తర్వాత ‘పృధ్వి’ మిసైల్ నిర్మాణం జరిగింది
కలాం ప్రధానమంత్రికి చీఫ్ సైంటిఫిక్ అడ్వైజర్గాను, సెక్రటరి డిఆర్డిఓగాను పనిచేశాడు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆయనకు అతి విశిష్టమైన భారతరత్న బిరుదును ప్రదానం చేసింది. 2002లో అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీ, ప్రతిపక్షంలోని కాంగ్రెసు సంయుక్తంగా ఆయనను రాష్ట్రపతి పదవికి నిలబెట్టి గెలిపించారు. ఆయన ఆ పదవిలో అయిదేళ్ళు పూర్తికాలం పనిచేసి దేశసేవకు తన జీవితం అంకితం చేసారు అలా పేపర్‌ బాయ్‌ నుంచి ప్రసిడెంట్‌ స్థాయికి ఎదిగిన కలాం జీవితం ఎంతోమందికి ఆదర్శం… పని చేసిన ప్రతిరంగంలో విజయవంతమై, పరిపూర్ణ జీవితాన్ని గడిపారు.
కలాంకు భగవద్గీత అన్నా, అందులోని రెండవ అధ్యాయం అన్నా చాలా శ్రద్ధ ఉండేదట… 2015 జూలై 27న ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్’లో ఉపన్యసిస్తూ ఆయన తుదిశ్వాస విడిచారు. కలాం లాంటి మహనీయులను భరత మాత కోల్పోయింది. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి నాయకులు వస్తారో లేదో కూడా తెలియదు. రాజకీయాలు పూర్తిగా మారిపోయాయి.. ఆనాటి స్వంతంత్ర్య స్పూర్తి ఇప్పటి నాయకుల్లో కూసంతైనా ఉందంటారా..?

Read more RELATED
Recommended to you

Latest news