తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రోజున సురక్ష దినోత్సవం జరిగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్ మహానగరంలో ఏర్పాటు చేసిన లేజర్, డ్రోన్ షోలు ఆకట్టుకున్నాయి. హైదరాబాద్ దుర్గం చెరువు తీగెల వంతెన వద్ద ఏర్పాటు చేసిన లేజర్ షో అలరించింది. అనంతరం డ్రోన్ ప్రదర్శన అద్యంతం అద్బుతంగా కొనసాగింది.
సుమారు 15 నిమిషాల పాటు జరిగిన డ్రోన్ షోలో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల చిహ్నాలతో డ్రోన్లు.. విద్యుత్ కాంతులతో ఆకాశంలో చక్కర్లు కొడుతూ కనువిందు చేశాయి. అంబేడ్కర్, KCR, సచివాలయం, తెలంగాణ పోలీస్ లోగో, కాళేశ్వరం ప్రాజెక్టు, టీ-హబ్, కారు గుర్తు, మిషన్ భగీరథ కార్యక్రమ చిహ్నం, సైబరాబాద్ పోలీస్ చిహ్నాలు ఆకట్టుకున్నాయి. చివరగా జై తెలంగాణ.. జై భారత్తో డ్రోన్ షో ముగిసింది.
ఈ డ్రోన్ షోపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. అత్యద్భుతంగా ఉంది అంటూ కితాబు ఇచ్చారు. తెలంగాణ పథకాలు, తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ చేపట్టిన కార్యక్రమాల గురించి లేజర్ షో చేయడం చాలా బాగుందని కొనియాడారు.
What a spectacular Drone show by @CPCyberabad & team 👏
Showcasing the flagship projects of the police department and all other Telangana Govt schemes
Great job and we may need to do this more often now 😁#TelanganaTurns10 #TelanganaFormationDay pic.twitter.com/teobmA7pCt
— KTR (@KTRBRS) June 4, 2023