తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానం చాటేలా.. తెలంగాణ దశాబ్ధి ఉత్సవం

-

తొమ్మిదేళ్ల ప్రగతి ప్రస్థానాన్ని యావత్ భారతావనికి తెలియజేస్తూ.. తొమ్మిదేళ్లలో కేసీఆర్ సర్కార్ చేసిన అభివృద్ధిని ప్రజలకు మరోసారి గుర్తుచేస్తూ.. స్వరాష్ట్రం కోసం తెలంగాణ అమరవీరులు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ తెలంగాణ దశాబ్ధి ఉత్సవాలను అట్టహాసంగా.. అంగరంగ వైభవంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పునరుద్ఘాటించారు. ఈ మేరకు వివిధ శాఖల మంత్రులతో తరచూ సమీక్షలు ఏర్పాటు చేస్తూ ఉత్సవాల ఏర్పాట్లపై పర్యవేక్షిస్తున్నారు. జూన్ 2 నుంచి 21 రోజుల పాటు జరగనున్న ఈ వేడుకల్లో రోజుకో శాఖ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల నిర్వహణలో లోటుపాట్లు లేకుండాచూడటం సహా సమన్వయంతో విజయవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. వేడుకల నిర్వహణపై అన్నిశాఖల కార్యదర్శులు ఆ తర్వాత కలెక్టర్లతో దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా ఉత్సవాల నిర్వహణ, ఏర్పాట్లపై ఆరా తీశారు. డాక్యుమెంటరీలు, సంబంధిత పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. 33 జిల్లాల్లో చేస్తున్న ఏర్పాట్ల గురించి కలెక్టర్లను అడిగి తెలుసుకున్నారు. 21 రోజులపాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సూక్ష్మస్థాయిలో సమీక్షించారు.

Read more RELATED
Recommended to you

Latest news