CSK గెలిచిన వేళ.. కూతురు జీవాతో ధోనీ ఎమోషనల్ మూమెంట్.. వీడియో వైరల్

-

మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీ.. తన సారధ్యంలో చెన్నై సూపర్ కింగ్స్​ను మరోసారి విజయతీరాలకు చేర్చాడు. తన మాస్టర్ మైండ్​తో ఈఏడాది కూడా కప్పు గెలుచుకున్నాడు. అహ్మదాబాద్‌లో జ‌రిగిన ఐపీఎల్ 2023 ఫైన‌ల్‌ ఉత్కంఠ‌ భ‌రిత పోరులో చెన్నై సూప‌ర్ కింగ్స్ అయిదు వికెట్ల తేడాతో గుజ‌రాత్ టైటాన్స్‌పై విజ‌యం సాధించింది. ఈ విజయం తర్వాత ఆ స్టేడియంలో ఎన్నో భావోద్వేగ సంఘటనలు చోటుచేసుకున్నాయి. అన్నింట్లోనూ.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ది బెస్ట్ మూమెంట్ ఒకటి ఉంది. అదే ధోనీ-జీవాల భావోద్వేగ కౌగిలి.

ధోనీ తన టీమ్​తో విజయోత్సవాన్ని పంచుకున్న తర్వాత.. ధోనీ కూతురు జీవా కూడా మోదీ స్టేడియంలోకి వచ్చింది. మైదానంలోకి వ‌చ్చిన జీవా త‌న తండ్రిని త‌నివితీరా హ‌త్తుకున్నది. ఆ క్షణంలో జీవా ముఖంపై ఉన్న ఎక్స్​ప్రెషన్ ఎన్ని కోట్లు పెట్టినా ధోనీకి దొరకని ఓ అపురూమైన అనుభూతి అని నెటిజన్లు అంటున్నారు. ధోనీ భార్య సాక్షీ కూడా చెన్నై ఆట‌గాళ్ల‌తో త‌న సంతోషాన్ని షేర్ చేసుకుంది. ఆ అద్భుత క్ష‌ణాల‌కు చెందిన వీడియోను ఇవాళ ఐపీఎల్ త‌న ట్విట్ట‌ర్‌లో పోస్టు చేసింది. సీఎస్కే ప్లేయ‌ర్ల‌తో క‌లిసి జీవా ఐపీఎల్ ట్రోఫీని ఎత్తుకుంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news