తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా సాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఇవాళ విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో వేడుకలు జరగనున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ విద్యుత్ విజయోత్సవ సభలు నిర్వహించనున్నారు.
ఈరోజు సాయంత్రం రవీంధ్రభారతిలో రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో గత 9 ఏళ్లలో తెలంగాణ సాధించిన విజయాలపై డాక్యుమెంటరీ ప్రదర్శన, పుస్తకావిష్కరణ, ప్రసంగాలు ఉంటాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ట్రాన్స్ కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు, స్పెషల్ సీఎస్, ఎనర్జీ తో పాటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటారు.
రాష్ట్రంలోని అన్ని సబ్ స్టేషన్లను, ఇతర విద్యుత్ కార్యాలయాలను 21 రోజుల పాటు సీరియల్ బల్బులతో పూలతోరణాలతో అద్బుతంగా అలంకరించనున్నారు. ప్రతి గ్రామంలో విద్యుత్ గురించి నాడు-నేడు పద్దతిలో ఫ్లెక్సీల ఏర్పాటు చేయనున్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రోజున సురక్ష దినోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించిన విషయం తెలిసిందే.