Breaking : ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణ

-

ఒడిశా రైలు ప్రమాద ఘటనపై సీబీఐ విచారణకు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ఆదేశించారు. ఈ ఘోర ప్రమాదం వెనక ఉగ్రకుట్ర ఉందని ప్రతిపక్షాలతో సహా అన్ని రాజకీయ పార్టీలు తీవ్రస్థాయిలో కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. మరోవైపు మానవతప్పిదమనే ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. అయితే.. ఈ దుర్ఘటనపై దర్యాప్తు బాధ్యతలను సీబీఐకి అప్పగించాలని కేంద్ర రైల్వే బోర్డు సిఫారసు చేసిందని వివరించారు.

ఘటన స్థలంలో సహాయ చర్యలు, ట్రాక్ పునరుద్ధరణ పనులు పూర్తయ్యాయని, ఓవర్ హెడ్ వైరింగ్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. కాగా, ప్రమాదం సమయంలో కోరమాండల్ ఎక్స్ ప్రెస్, బెంగళూరు-హౌరా ఎక్స్ ప్రెస్ రైళ్లు పరిమిత వేగంతోనే ప్రయాణిస్తున్నాయని అధికారులు భావిస్తున్నారు.

ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్ వ్యవస్థ కూడా సజావుగానే ఉందని, కానీ అందులో ఎవరైనా ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చన్న అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. సిగ్నలింగ్ లోపమే ఈ ఘోర దుర్ఘటనకు కారణమని రైల్వే శాఖ ప్రాథమిక నివేదికలో పేర్కొనడం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version