పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం

-

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ మధ్యంతర బడ్జెట్‌ ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. వరుసగా ఆరోసారి ఆమె పద్దును ప్రవేశపెట్టి మెురార్జీ రికార్డును సమం చేశారు. మన్మోహన్‌, జైట్లీ, చిదంబరం, యశ్వంత్‌ సిన్హా రికార్డును నిర్మల అధిగమించారు. డిజిటల్‌ రూపంలో బడ్జెట్‌ కాపీ అందుబాటులోకి తీసుకువచ్చారు. పదేళ్లలో ఆర్థిక వ్యవస్థ ఉచ్ఛస్థితికి చేరుకుందని నిర్మలా సీతారామన్ అన్నారు. సబ్‌కా సాత్‌ సబ్‌కా వికాస్‌ నినాదం భారత ఆర్థిక మూలాలను పటిష్టం చేసిందని తెలిపారు. పదేళ్లలో మోదీ నాయకత్వంలో అమలు చేసిన సంస్కరణలు ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదం చేశాయని పేర్కొన్నారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థలో కొత్త ఉత్సాహాన్ని నింపాయని వివరించారు.

 

నూతన సంస్కరణలతో కొత్త పారిశ్రామిక వేత్తలు పుట్టుకొచ్చారు. ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణంలో ప్రతి వ్యక్తి భాగస్వాములయ్యారు. ఆర్థిక వ్యవస్థకు కొత్త దశ, దిశ ఏర్పడింది. సమ్మిళిత, సంతులిత ఆర్థిక విధానాలు ఆర్థిక వ్యవస్థలో చిట్టచివరి వ్యక్తి వరకు అభివృద్ధిని తీసుకెళ్లాయి. ఇంటింటికి విద్యుత్‌, ఇంటింటికి ఉపాధి, ఇంటింటికి తాగునీరు అన్నది సమ్మిళిత అభివృద్ధికి నిదర్శనంగా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news