పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు..ప్రారంభమయ్యాయి. ఈ తరుణంలోనే.. లోక్‌సభలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెడుతోన్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెడుతున్నారు నిర్మలా సీతారామన్. ఈ సందర్బంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ…సబ్‌కా సాత్, సబ్‌కా వికాస్, సబ్‌కా విశ్వాస్.. అదే మా మత్రం అన్నారు.

గత పదేళ్లలో అందరికి ఇళ్ల నిర్మాణానికి కృషి చేశామని తెలిపారు. పదేళ్లల్లో ఆర్థిక స్థితి ఉన్నతస్థాయికి చేరుకుందని చెప్పారు. బాధ్యతాయుతంగా తీసుకున్న నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేశాయని వివరించారు నిర్మలా సీతారామన్. ఇక సుమారు 4 లక్షల కోట్ల రూపాయల మేరకు ఆహారం, ఎరువుల సబ్సిడీలకు కేటాయుంపులు చేయడం ద్వారా దేశానికి ఆహార భద్రత ను కల్పించడమే లక్ష్యంగా బడ్జెట్ రూపొందించారు. గృహ వసతి రంగానికి 1 ట్రిలియన్ రూపాయల మేరకు కేటాయింపులు పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పదేళ్లుగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు.