అనేక కొత్త సవాళ్ల మధ్య భారత్‌ నూతన మార్గాన్ని అన్వేషిస్తోంది : నిర్మలా సీతారామన్

-

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు 2024-25 ప్రారంభమయ్యాయి. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టి ప్రసంగిస్తున్నారు. ప్రపంచం కొత్త సవాళ్లను ఎదుర్కొంటోందని ఆమె అన్నారు. ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో యుద్ధ వాతావరణం, దేశాల మధ్య ఉద్రిక్తతలు ప్రపంచ వాణిజ్యాన్ని క్లిష్టతరం చేస్తున్నాయని తెలిపారు. అనేక కొత్త సవాళ్ల మధ్య భారత్‌ నూతన మార్గాన్ని అన్వేషిస్తోందని వెల్లడించారు. పశ్చిమాసియా, యూరప్‌లో ఉన్న యుద్ధ వాతావరణం కొత్త సవాళ్లను మన ముందుంచిందని పేర్కొన్నారు. సవాళ్లను ఎదుర్కొని ప్రపంచాన్ని కొత్త మార్గంలో వెళ్లే దిశగా భారత్ సుదృఢమైన పాత్రను పోషిస్తోందని వివరించారు.

“జనాభా, ప్రజాస్వామ్యం, భిన్నత్వం అన్నది మూడు మూలసూత్రాలుగా భారత్‌ ముందడుగు వేస్తోంది. నూతన ప్రపంచంలో అనేక అవకాశాలు భారత్‌ అందిపుచ్చుకుంటోంది. అభివృద్ధి చెందిన భారత్‌గా ఎదిగేందుకు ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం. 2047 నాటికి ఏర్పాటు చేసుకున్న లక్ష్యాన్ని సాధించే దిశగా ముందడుగు వేస్తున్నాం. అవకాశాలను సృష్టించుకోవడంలో ఆకాశమే హద్దుగా భారత్‌ ముందడుగు వేస్తోంది. కొత్త ప్రపంచంతో అనుసంధానమవుతూ కొత్త అవకాశాలను సృష్టిస్తూ దిక్సూచిగా భారత్‌ నిలబడుతోంది.” అని నిర్మలా సీతారామన్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news