వైద్య, విద్యా రంగానికి భారీగా నిధులు కేటాయించిన నిర్మల…!

-

త్వరలో కొత్త విద్యావిధానం తీసుకొస్తామని నిర్మలా సీతారామన్ ప్రకటించారు. డిగ్రీ లెవల్ లో ఆన్లైన్ ప్రోగ్రామ్స్ కి ప్రతిపాదన తీసుకొస్తామని అన్నారు. నేషనల్ పోలీస్ యునివర్సిటి, నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామన్నారు. పట్టాణ స్థానిక సంస్థల్లో కొత్త ఇంజనీర్లకు అవకాశం కల్పిస్తామని అన్నారు. విద్యా రంగానికి 99, 300 కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ప్రతీ జిల్లా ఆస్పత్రిలో మెడికల్ కాలేజి ఏర్పాటు చేస్తామన్నారు. విద్యారంగంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తామని అన్నారు.

త్వరలో విదేశీ విద్యార్ధులకు స్టడీ ఇన్ ఇండియా ప్రోగ్రాం మొదలుపెడుతున్నట్టు చెప్పారు. ఇక వైద్య రంగానికి ఆమె పెద్ద పీట వేసింది కేంద్రం. వైద్య రంగానికి 69 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. ప్రధాని జన యోజనకు 69 వేల కోట్లు కేటాయిస్తున్నట్టు చెప్పారు. 2౦25 నాటికి క్షయ వాది నిర్మూలనే లక్ష్యమని అన్నారు. మరో కొత్త 5 స్మార్ట్ సిటీలను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ సెల్ ఏర్పాటు చేస్తామని నిర్మల తన బడ్జెట్ లో ప్రకటించారు. జిల్లా ఆస్పత్రులుగా మెడికల్ కాలేజీలు ఉంటాయని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news